ఎంపీ విజయసాయి రెడ్డిపై వస్తోన్న ఆరోపణలపై నటి పూనమ్ కౌర్ స్పందించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. రెండు రోజులుగా సోషల్ మీడియా లో , అలాగే మీడియా చానెల్స్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల పేర్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేసారు. 80 ఏళ్ల వయసులో విజయసాయి రెడ్డి తండ్రి కాబోతున్నారంటూ విషెష్ చెపుతూ హంగామా సృష్టించారు. ఈ ఆరోపణలను శాంతి ఖండించింది. తనకు పుట్టబోయే బిడ్డ కు విజయసాయి కి ఎలాంటి సంబంధం లేదని..తనకు పుట్టబోయే బిడ్డ తండ్రి సుభాష్ అంటూ తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు విజయసాయి రెడ్డి సైతం ఈ వ్యవహారం ఫై స్పందించారు. తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగానే అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన సంబంధం అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది. ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతా అన్నారు. అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో.. అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతోన్నాయని అన్నారు. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి హెచ్చరించారు.
ఇదిలా ఉండగానే ఈ వ్యవహారం ఫై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ‘టీవీ ఛానళ్లు బ్లాక్ మెయిలింగ్ సంస్థలుగా మారాయి. గిరిజనురాలైన శాంతి అనే అధికారిని ఇబ్బంది పెట్టేందుకు కూడా ఒకటే ప్యాటర్న్ వాడారు. ప్రెగ్నెంట్ అని, డబ్బులు తీసుకుందన్నారు. నేను ఆ మహిళకు ఒక్కటే చెప్తున్నా. నువ్వు ఏడిస్తే వాళ్లు గెలిచామని అనుకుంటారు. ఒత్తిళ్లకు లొంగవద్దు. నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.
Be brave ✊ pic.twitter.com/tB2JlsYMol
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 15, 2024
Read Also : Dream: కలలో శివలింగం మీద శివుడు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?