Elections : ఏపీ రాళ్ల రాజకీయాలు – మీవే ప్రాణాలా..మావీ కావా..?

రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు

  • Written By:
  • Updated On - April 15, 2024 / 01:02 PM IST

ఏపీ (AP)లో ప్రస్తుతం రాళ్ల రాజకీయం (Stone Attacks) నడుస్తుంది. అధికార – ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడుల పర్వం కొనసాగుతుంది. ఈ రాళ్ల దాడి ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టి..ఈ దాడులతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ రాయి మీద పడుతుందో..ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో..? ఏ విధంగా దాడి చేస్తారో అని ఖంగారుపడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొంతమంది హింసను ప్రేరేపించి విధంగా చేయడం ఫై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా జరగాల్సిన ఎన్నికలు ఇలా ప్రాణాలు తీసేలా చేస్తారా అంటున్నారు.

గతంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఫై పలుమార్లు రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరైనా ఈ దాడులకు ఖండించాలి. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కీలకమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో స్పందించాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం అలాగే జరుగుతాయి..అంతకన్నా ఎక్కువ జరుగుతాయి..ప్రజాస్యామ్యంలో ఇవి కామన్..నచ్చకపోతే ఇలాగే చేస్తారు..మాములు గులకరాయి తో కొడితే దెబ్బ తగులుతుందా..? ప్రాణాలు పోతాయా..? అని ఇంకాస్త రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఈ దాడులకు నిరసన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తే వారిని అరెస్ట్ చేయడం వంటివి చేసారు.

ఇక ఇప్పుడు వాళ్ల దగ్గరకు వచ్చేసరికి గులకరాయి కూడా పెద్ద బండరాయి గా మారింది. రాళ్ల దాడులు కాస్త హత్యారాజకీయాలు అయ్యాయి. రెండు రోజుల క్రితం సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి తో దాడి చేసాడు. దీంతో ఆయన ఎడుమ కన్ను పైభాగాన గాయమైంది. ఈ దాడికి పాల్పడింది టిడిపి వల్లే అంటూ వైసీపీ వారు ఆరోపించడం మొదలుపెట్టారు. సీఎంపై ఎప్పుడు దాడి జరుగుతుందా, ఎప్పుడు విపక్ష నేతలపై విరుచుకుపడదామా అని కాచుకుని కూర్చున్నట్టుగా ఇలా ఆ ఘటన జరిగిందో లేదో వెంటనే ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. గులకరాయితో కొడితే ప్రాణాలు పోతాయా అన్నవారే ఇప్పుడు సీఎం జగన్ ఫై హత్యాయత్నం జరిగిందని, దానికి విపక్ష నాయకులే కారణమని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతూ నానా రచ్చ చేస్తున్నారు. అయితే వీరి నిరసనలు , ఆరోపణలపై టిడిపి శ్రేణులు ఖండిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఫై జరిగిన దాడులు గుర్తు చేస్తున్నారు.

చంద్రబాబుపై ఇప్పటివరకు జరిగిన రాళ్ల దాడులు చూస్తే..

అంగళ్లు :

ఆగస్ట్ 4 , 2023 లో ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో రాళ్లదాడి జరిగింది. ఈ దాడి నుండి కూడా చంద్రబాబు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రాళ్లదాడిలో అంగళ్లులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది సాధారణ రాళ్లదాడి కాదు… తనను చంపేందుకు జరిగిన కుట్ర అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. అయితే పోలీసులు మాత్రం అంగళ్లులో ఉద్రిక్తతలకు కారణం చంద్రబాబే అంటూ పోలీసులు కేసులు పెట్టారు.

తిరుపతి :

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతిచెందడంతో 2021లో ఈ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనూ చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై రాళ్లు విసిరారు దుండగులు. కానీ ఆ రాళ్లు చంద్రబాబు వరకు చేరకపోవడంతో ప్రమాదం తప్పింది.

అమరావతి :

జగన్ అధికారం చేపట్టిన కొత్తలో చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి జరిగింది. రాజధాని అమరావతి పరిస్థితిని పరిశీలించేందుకు టిడిపి సీనియర్లతో కలిసి చంద్రబాబు బస్సులో వెళుతుండగా రాళ్లదాడి జరిగింది. వాహనంపై దుండుగులు రాళ్లు విసరడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో బస్సులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు… చంద్రబాబుతో సహా అందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పిలిచుకున్నారు.

యర్రగొండపాలెం :

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో గతేడాది చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతేడాది ఇదే ఏప్రిల్ నెలలో యర్రగొండపాలెం వెళుతున్న చంద్రబాబును మంత్రి ఆదిమూలపు సురేష్ తన వర్గీయులతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. చంద్రబాబును కాపాడే క్రమంలో ఆయన భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

నందిగామ :

2022 లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా నందిగామలో రోడ్ షో చేపట్టిన చంద్రబాబు రాళ్లదాడి జరిగింది. ఈ క్రమంలో ఓ దుండగుడు చంద్రబాబుపై రాయి విసరగా అదికాస్త భద్రతా సిబ్బందికి తగిలింది. దీంతో చంద్రబాబు భద్రతాధికారికి తీవ్ర గాయం అయ్యింది. ఇలా అనేకసార్లు చంద్రబాబు ఫై దాడి జరిగింది. ఇలా దాడులు జరిగినప్పుడల్లా వైసీపీ నేతలు వారికీ వారు సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. కానీ ఏనాడూ దాడిని ఖండించలేదు. అదే ఇప్పుడు జగన్ ఫై దాడి జరిగే సరికి నానా రభస చేస్తున్నారు. చంద్రబాబు ఫై దాడి జరిగితే ఒక విధంగా ఇప్పుడు మీ నేత ఫై జరిగితే మరోవిధంగా మాట్లాడతారా..? మీవేనా ప్రాణాలు , మావీ కావా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా సరే తమ మంచి తో ప్రజలను గెలవలె కానీ ఇలా రాళ్ల దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేయొద్దంటూ హితవు పలుకుతున్నారు.

Read Also : NTR : వార్ 2లోని ఎన్టీఆర్ లుక్‌ని లీక్ చేసిన చేసిన ఊర్వశి రౌటెలా.. సెల్ఫీ పిక్ వైరల్..