Vijayawada TDP : వైసీపీ నేత సొమ్ముతో టీడీపీ నేత సోకులు.. ఇద్ద‌రి టార్గెట్ ఇదేన‌ట‌..?

విజ‌య‌వాడ‌లో రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉంది. అధికార వైసీపీకి బెజ‌వాడ పార్ల‌మెంట్‌ అభ్య‌ర్థి క‌రువైతే.. ప్ర‌తిప‌క్ష టీడీపీలో సిట్టింగ్

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 03:19 PM IST

విజ‌య‌వాడ‌లో రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా ఉంది. అధికార వైసీపీకి బెజ‌వాడ పార్ల‌మెంట్‌ అభ్య‌ర్థి క‌రువైతే.. ప్ర‌తిప‌క్ష టీడీపీలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని కాద‌ని ఆయ‌న సోద‌రుడు చిన్నిని రంగంలోకి దించ‌డం క్యాడ‌ర్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే ఈ గంద‌ర‌గోళంతో అధికార పార్టీలో గ‌తంలో పోటీ చేసి ఓడి పోయిన పీవీపీకి మ‌ళ్లీ ఆశ‌లు చిగురించాయ‌ట‌. తాను ఎలాగైన ఈ సారి గెలిచి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టాల‌నుకుంటున్నారంట‌. అందుకు ఆయ‌న ఓ ప్లాన్‌ని రెఢీ చేసి అమలు కూడా చేస్తున్నార‌ని బెజ‌వాడ పొలిటిక‌ల్ సర్కిల్‌లో టాక్ న‌డుస్తుంది. ఆయ‌న‌కు శ‌త్రువుగా ఉన్న ప్ర‌తిప‌క్ష పార్టీ ఎంపీ కేశినేని నానిని, టీడీపీని దెబ్బ‌తీసేందుకు ఆ ఎంపీకి సొంత పార్టీలోనే ఉన్న‌వ్య‌తిరేక వ‌ర్గంతో చేయి క‌లిపారంట‌. ఆ వ్య‌తిరేక వ‌ర్గానికి ఆర్థికంగా అన్ని విధాలుగా పీవీపీ ఆదుకుంటున్నార‌ని క్యాడ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వారిద్ద‌రు కొట్టుకుంటే నాకే ప్ర‌యోజనం కలుగుతుంద‌ని స‌ద‌రు వైసీపీ నేత భావిస్తున్నార‌ట‌.. అందుకోస‌మే ఆయ‌న కూడా ఆ టీడీపీ నేత చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆ వైసీపీ నేత కూడా ఆర్థికంగా ఓ చేయి వేసిన‌ట్లు బెజ‌వాడ టీడీపీలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.

టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇటీవ‌ల సొంత పార్టీపై తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తికి కార‌ణం పార్ల‌మెంట్‌లో సొంత పార్టీ నేత‌లు చేస్తున్న రాజ‌కీయ‌మేన‌ట‌.. ఇటీవ‌ల ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ త‌న‌కు ప్ర‌స్తుతం 20 శాతం మాత్ర‌మే కాలుతుంద‌ని.. 100 శాతం కాలితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల్ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు వాడేసుకుంటున్నారు. టీడీపీ నుంచి నాని కాద‌ని..ఆయ‌న సోద‌రుడు చిన్ని పోటీ చేస్తే.. ఖ‌చ్చితంగా కేశినేని నాని ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవ‌కాశం ఉంది. నాని ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే టీడీపీ ఓట్లు చీలిపోతాయి. దీంతో వైసీపీ అభ్య‌ర్థికి క‌లిసి వ‌స్తుంది. కాబ‌ట్టి ఎలాగైనా ఎంపీ కేశినేని నానికి 100 శాతం కాలేలా చేయాల‌నేది స‌ద‌రు ఇద్ద‌రి నేత‌ల ఆలోచ‌న‌ట‌. అందుకే గ‌త నాలుగేళ్లుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత పీవీపీ ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో మెరిశారు. త‌న ప్ర‌త్య‌ర్థి కేశినేని నానిపై పోస్టులు పెడుతూ మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యాను అనే సంకేతాలు పీవీపి ఇస్తున్నార‌ట‌. పీవీపీ వేస్తున్న ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుండ‌టంతోనే ఆయ‌న మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యార‌నే టాక్ బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్‌లో వినిపిస్తుంది.

గ‌త నాలుగేళ్లుగా పీవీపీని పార్ల‌మెంట్ ఇంఛార్జ్‌గా కూడా సొంత‌పార్టీ నేత‌లు గుర్తించ‌లేదు. విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు స‌హా.. స్థానిక ఎమ్మెల్యేలు క‌ట్టే ఫ్లెక్సీల్లో కూడా పీవీపీ మోహం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో వైసీపీకి పీవీపీ దూరం అయ్యాడ‌ని ..కొత్త అభ్య‌ర్థి కోసం అధిష్టానం వేట మొద‌లు పెట్టింది. అయితే మ‌ళ్లీ పీవీపీ యాక్టీవ్ అవ్వ‌డంతో అభ్య‌ర్థి ఆయ‌నే అయ్యే అవ‌కాశం ఉంది. దీని కోస‌మే ఎంపీ కేశినేని నానిని, టీడీపీని దెబ్బ‌తీసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలో ఓ వ‌ర్గంతో చేతులు క‌లిపి అదిరిపోయే ప్లాన్ వేశార‌ని టీడీపీ క్యాడ‌ర్ చ‌ర్చించుకుంటుంది. బెజ‌వాడ టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అధిష్టానం కూడా ఇంకా మౌనం వీడ‌క‌పోతే పార్టీ తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తింటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.