Political Proffessor CBN : రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ టైటిల్ తో చంద్ర‌బాబు `PPT`

చంద్ర‌బాబు ప్రాఫెస‌ర్ గా ( Political Proffessor CBN ) మారారు. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 02:57 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాఫెస‌ర్ గా ( Political Proffessor CBN ) మారారు. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్ త‌ర‌హాలో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ చేసిన ద్రోహాన్ని ఆధారాల‌తో విడ‌మ‌ర‌చి చెప్పారు. వ్య‌వ‌సాయాన్ని ఏ విధంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ల‌క్ష్యం చేశారు? అనేదానిపై మంగ‌ళ‌వారం పవ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ఇచ్చిన. ఆయ‌న బుధ‌వారం రోజు నీటి పారుద‌ల ప్రాజెక్టుల గురించి తెలియ‌చేశారు. తెలుగుదేశం పార్టీ హ‌యాంలో 9 శాతానికి పైగా బ‌డ్జెట్ లో ఖ‌ర్చు చేస్తే, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం సుమారు 2శాతం మాత్ర‌మే వ్య‌యం చేసింద‌ని వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్టారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాఫెస‌ర్ గా ( Political Proffessor CBN )

గ‌త మూడు వారాలుగా వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌తో వైసీపీ, జ‌న‌సేన ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చారు. ప‌రస్ప‌రం కేసులు పెట్టుకున్నారు. ఇళ్ల‌లోని మ‌హిళ‌ల్ని కూడా రాజ‌కీయాల్లోకి లొక్కొచ్చారు. మూడు పెళ్లిల ద‌గ్గ‌ర నుంచి తార్చుగాడు అంటూ ప‌వ‌న్ మీద వైసీపీ లీడ‌ర్లు బూత‌పురాణం వినిపించారు. ప్ర‌తిగా స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సెకండ్ సెట‌ప్ నుంచి రాజారెడ్డి పెళ్లిల్లు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెంగుళూరు పాలెస్ అక్ర‌మ సంబంధాల‌ను జ‌న‌సేన బ‌య‌ట‌పెట్టింది. ఇరు పార్టీల ప్రైవేటు జీవితాల‌పై విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. దాని వ‌ల‌న ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం ఉప‌యోగం లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆ రెండు పార్టీలు వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాన్ని రంకు వైపు న‌డిపించారు. ప్ర‌జ‌ల దృష్టిని ఆ రెండు పార్టీల‌పై నిలిపేలా చేయ‌గ‌లిగారు. గాడిత‌ప్పుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధి గురించి ఆలోచించేలా ( Political Proffessor CBN ) ప‌వ‌ర్ ప్ర‌జెంటేన్ కు శ్రీకారం చుట్టారు.

చంద్ర‌బాబు ఏపీ అభివృద్ధి గురించి ఆలోచించేలా  ప‌వ‌ర్ ప్ర‌జెంటేన్

తెలుగుదేశం పార్టీ హయాంలోని అభివృద్ధి, ఇప్పుడు కుంటుప‌డిన ప్ర‌గ‌తిని బేరీజు వేస్తూ ఆధారాల‌తో బ‌య‌ట‌పెట్టారు. ఆలోచించాల‌ని ఏపీ పౌరుల‌కు పిలుపునిచ్చారు. భావోద్వేగాలు, కులం, మ‌తం, ప్రాంతం కోణం నుంచి చూడ‌కుండా రాష్ట్ర భ‌విష్య‌త్ ను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అంతేకాదు, ఏ మాత్రం త‌ప్ప‌ట‌డుగువేసి మ‌రో ఐదేళ్ల పాటు రాజ్యాధికారాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇస్తే రాష్ట్రం ఏమ‌వుతుంది? అనేది తెలుసుకోవాల‌ని సూచిస్తున్నారు. రాజ‌కీయంగా 45ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు చెబుతోన్న మాట‌ల‌ను ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌లు ఆల‌కించేలా ( Political Proffessor CBN ) ఆధారాల‌ను అంద‌రికీ అంద‌చేస్తున్నారు.

రాయ‌ల‌సీమ‌లోని ప్రాజెక్టులు అన్నింటికీ వాట‌ర్ వచ్చేవ‌ని అర్థ‌మ‌య్యేలా గ్రాఫ్

రాయ‌ల‌సీమ‌లోని చిన్ని, మ‌ధ్య త‌ర‌హా, భారీ ప్రాజెక్టులు 69 ఉన్నాయ‌ని తేల్చారు. వాటిని తెలుగుదేశం పార్టీ హ‌యాంలో ఎంత ఖ‌ర్చు చేసి అభివృద్ధి ప‌రిచిందో లెక్క‌ల‌తో స‌హా స్క్రీన్ మీద చూపించారు. ఆ త‌రువాత ప‌త్రాల‌ను కూడా మీడియాకి అందించారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లు రాక‌పోవ‌డానికి కారణాల‌ను చూపించారు. అవ‌గాహ‌న‌లేని నాయ‌కుల చేతిలో అధికారాన్ని పెడితే ఇలాగే ఉంటుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. కృష్ణా నీళ్ల‌ను రాయ‌లసీమ‌కు మ‌ళ్లించేలా అప్ప‌ట్లో చేప‌ట్గిన ప‌ట్టిసీమ‌ను మూల‌న‌ప‌డేశార‌ని విమ‌ర్శించారు. పోల‌వ‌రం పూర్తి చేసి ఉంటే, రాయ‌ల‌సీమ‌లోని ప్రాజెక్టులు అన్నింటికీ వాట‌ర్ వచ్చేవ‌ని అర్థ‌మ‌య్యేలా గ్రాఫ్ వేసి ( Political Proffessor CBN ) చూపించారు. ఇలాంటి ప్ర‌జెంటేష‌న్ల‌ను ప్ర‌తి రోజూ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యారు.

Also Read : CBN Facts : అన్న‌దాత కోసం చంద్ర‌బాబు!దాస్తే దాగ‌ని స‌త్యాలివి!

రాబోవు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌రో ఛాన్స్ ఇస్తే, భ‌యాన‌క ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చంద్ర‌బాబు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అన్యాయాన్ని వివ‌రిస్తున్నారు. ఆయ‌న అవ‌గాహ‌న లోపం కార‌ణంగా ఏపీ రాష్ట్రం అనాధ‌లా మిగులుతుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాబోవు రోజుల్లో జాగ్ర‌త్త‌గా ఆలోచించ‌క‌పోతే, రాష్ట్ర భ‌విష్య‌త్ అంధ‌కారం అవుతుంద‌ని ప‌క్కా ఆధారాల‌తో బ‌య‌ట‌పెడుతున్నారు. ఇప్ప‌టికీ ఆలోచించ‌కుండా ప్రాంతానికి, కులానికి, మ‌తానికి ప్రాధాన్యం ఇస్తూ ఓట్లు వేస్తే మీ ఇష్టం అంటూ ప్ర‌జ‌ల‌కే వ‌దిలేస్తున్నారు చంద్ర‌బాబు.

Also Read : CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?