Political port : బంద‌ర్ పోర్ట్ కు అమ‌రావ‌తిని ముడేసిన జ‌గ‌న్‌

మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు(Political port) ఏర్పాటు, అమరావ‌తి భూములు ధ‌ర‌ల‌కు లింకు పెట్టేశారు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 02:55 PM IST

బోడిగుండుకు మోకాలి ముడిపెట్ట‌డం ఏపీ రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ఆ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందున్నారు. మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు(Politica port) ఏర్పాటు, అమరావ‌తి భూములు ధ‌ర‌ల‌కు లింకు పెట్టేశారు. అమ‌రావ‌తి (Amaravati) భూముల ధ‌ర‌లు పెర‌గాలంటే ఓడ‌రేవు మ‌చిలీప‌ట్నంలో ఉండ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు భావించార‌ట‌. అందుకే, మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు ఏర్పాటు కాకుండా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేశార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన అతిపెద్ద ఆరోప‌ణ‌. బంద‌రు పోర్ట్ ఏర్పాటు నిర్మాణ ప‌నుల‌ను సోమ‌వారం ప్రారంభించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తికి ముడిపెడుతూ ఆ ఓడ‌రేవును పోల్చడం గ‌మ‌నార్హం.

మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవు ఏర్పాటు, అమరావ‌తి భూములు ధ‌ర‌ల‌కు లింకు (Political port)

వాస్త‌వంగా తెలంగాణ‌కు బంద‌రు పోర్ట్ (Political port) ను ఇస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ర‌హ‌స్య జీవోను అప్ప‌ట్లో విడుద‌ల చేసింది. ఇదే అంశాన్ని అసెంబ్లీ వేదికగా టీడీపీ ప్ర‌శ్నించింది. ఏపీ సీఎంగా గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత 2019వ సంవ‌త్స‌రం జూన్ 28న RT -62 జీవోను ‘రహస్య జీవో జారీ అయింది. ప్ర‌తిప‌క్ష టీడీపీ బ‌య‌ట పెట్ట‌డంతో రెండు రోజుల్లో ‘జారీ చేయబడలేదు’ అని మార్చారు. తెలంగాణకు ఇస్తున్నారా? అని అసెంబ్లీలో అడిగితే లేదని బుకాయించారు. కానీ, ఆ త‌ర‌హా ప్ర‌యత్నం జ‌రిగింద‌ని అధికారులకు తెలుసు. అప్ప‌ట్లో హైద‌రాబాద్ లోని స‌చివాల‌యాన్ని ధారాద‌త్తం చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బంద‌రు పోర్ట్ ను తెలంగాణ‌కు ఇవ్వ‌డానికి తెగ‌బ‌డ్డారు. ప‌బ్లిక్ టెండ‌ర్లో తెలంగాణ ప్ర‌భుత్వం పాడుకుంటే త‌ప్పు ఏమిటి? అంటూ టీఆర్ఎస్ లీడ‌ర్లు కూడా అప్ప‌ట్లో ద‌బాయించారు. పోర్ట్ కావాల‌ని చాలా కాలంగా కేసీఆర్ (KCR)ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జీవో కూడా ఇచ్చారు. మ‌రో ఛాన్స్ సీఎంగా ఇస్తే, తెలంగాణ‌కు బంద‌ర్ పోర్ట్ ఇవ్వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ మాత్రం వెనుక‌డ‌గు వేయ‌ర‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌

అప్ప‌ట్లో చంద్ర‌బాబు బంద‌ర్ పోర్ట్ ను (Political port)అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేప‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. అందుకోసం 22 గ్రామాల ప్ర‌జ‌ల నుంచి 33వేల ఎకరాలు సేక‌రించాల‌ని ప్ర‌ణాళిక ర‌చించారు. ఆ మేర‌కు నోటిఫై చేసి, భూములను అమ్మ‌కూడ‌ద‌ని నిబంధ‌న పెట్టారు. ఓడ‌రేవును పెద్ద ఎత్తున నిర్మించ‌డం ద్వారా సింగపూర్ త‌ర‌హా అభివృద్ధిని చంద్ర‌బాబు ఆశించారు. రోడ్డు, రైలు, విమాన మార్గాల‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి అనుసంధానం చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇదే కాదు, దుగరాజ‌ప‌ట్నం, రామాయ‌ప‌ట్నం..ఇలా కోస్తా తీరం వెంబ‌డి ఓడ‌రేవుల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా ప్ర‌గ‌తిని ప‌రుగుపెట్టించాల‌ని భావించారు. అందులో భాగంగా భూముల‌ను సేక‌రించారు. అలా చేయ‌డం ఓడరేవును అడ్డుకునే కుట్ర అంటూ ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. భూముల అమ్మ‌కాల‌పై నిబంధ‌న పెడితే పోర్టు అడగరని చంద్రబాబు ప్లాన్ వేశారని, చివరకు ప్రజలే విజయం సాధించారని చెప్ప‌డం విచిత్రం. మ‌చిలీప‌ట్నం పోర్టు ఏర్పాటు కాకుంటే, అమరావతిలో బినామీగా పెట్టుకున్న భూములను విపరీతమైన ధరలకు అమ్ముకునేలా చంద్ర‌బాబు ద్రోహానికి పాల్ప‌డ్డార‌ని జ‌గ‌న్ ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

కోస్తా తీరం వెంబ‌డి ఓడ‌రేవుల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా ప్ర‌గ‌తి

వాస్త‌వంగా బంద‌రు పోర్ట్ ను (Political port) తెలంగాణ‌కు అప్ప‌గించ‌డం ద్వారా కేసీఆర్ తో స్నేహాన్ని పెంచుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చూశార‌ని విడుద‌లైన జీవో ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. స్నేహాలకు, సొంత లాలూచీలకు రాష్ట్ర ఆస్తులను ధారాదత్తం చేస్తామంటే తెదేపా సహించదని అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు రూ.5,516 కోట్లతో పోర్టు నిర్మాణ ప‌నుల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు. రూ. 5156 కోట్లతో నాలుగు బెర్తులు రాబోతున్నాయని వెల్లడించారు. 35 మిలియన్‌ టన్నుల కెపాసిటీతో పోర్టు స్టార్ట్‌ అవుతుందని వివ‌రించారు. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ.. 116 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వరకూ విస్తరించుకునే అవకాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. పోర్టుకు కనెక్టివిటీ ఇన్‌ఫ్రాను నిర్మిస్తున్నామని వెల్ల‌డించారు. ఓడ‌రేవుకు 6.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి, 7.5 కిలోమీటర్ల గుడివాడ- మచిలీపట్నం రైలు మార్గాన్ని కనెక్టివిటీ చేస్తున్నామని వివరించారు. బందరు కాల్వనీటిని పైపులైను ద్వారా తీసుకు వచ్చి.. అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.

Also Read : Junior NTR : TDPలో జూనియ‌ర్ క్రేజ్ డౌన్

మచిలీపట్నం పోర్టు వల్ల పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఉప‌యోగం ఉంటుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోర్టుకు రోడ్డు, రైలు మార్గాలకు కేవలం 250 ఎకరాలకు మాత్రమే తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ భూముల్లో 4వేల ఎకరాల్లో ఆధారిత పరిశ్రమలు వచ్చేట్టుగా కార్యాచరణ చేస్తున్నామన్నారు. 24 నెలల్లోనే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు. ఇదిలా ఉంటే, రాబోవు రోజుల్లో ఈ ఓడ‌రేవును తెలంగాణ కు ఇస్తార‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారానికి మాత్రం ఫుల్ స్టాప్ ప‌డ‌డంలేదు. మ‌రో ఛాన్స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇస్తే మ‌చిలీప‌ట్నం ఓడ‌రేవును(Political port) తెలంగాణ‌కు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ భావిస్తోంది.

మూడోసారి బంద‌ర్ పోర్ట్ శంకుస్థాప‌న (Political port)

కృష్ణా జిల్లాలోని బందరు పోర్టుకు(Political port) సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన ఇది మూడోసారి అంటూ ప్రతిపక్షాలు వెటకారమాడుతున్నాయి. వాస్తవానికి బందరు పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చిన కరగ్రహారం పల్లిపాలెం దగ్గర మొదటి సారి శంకుస్థాపన జరిగింది. అదే పోర్ట్ కి 2019 ఫిబ్రవరి 7న చంద్రబాబు(Chandrababu) కూడా ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమం మేకవానిపాలెం దగ్గర జరిగింది. . ఇప్పుడు శంకుస్థాపన సీఎం జగన్ చేస్తున్నారు. ఈసారి తపసిపూడి గ్రామ పరిధిలో భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ చేయ‌డం కొస‌మెరుపు.

Also Read  Axis Bank: యాక్సిస్ బ్యాంక్ లో సిటీ బ్యాంక్ విలీనం.. కస్టమర్ల డౌట్స్ క్లియర్