Political Policing : ప‌వ‌న్ పై అంజూయాద‌వ్ ఫిక్స్, తిరుప‌తి బ‌రిలో..?

అనంత‌పురం జిల్లాకు చెందిన పోలీస్ ఆఫీస్ (Political Policing)గోరంట్ల మాద‌వ్ ఎపిసోడ్ త‌ర‌హా ఎపిసోడ్ ను అంజూయాద‌వ్ రూపంలో చూడ‌బోతున్నాం.

  • Written By:
  • Updated On - July 21, 2023 / 04:53 PM IST

అనంత‌పురం జిల్లాకు చెందిన పోలీస్ ఆఫీస్ (Political Policing)గోరంట్ల మాద‌వ్ ఎపిసోడ్ త‌ర‌హా ఎపిసోడ్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ స‌ర్కిల్ ఇన్ స్సెక్ట‌ర్ అంజూయాద‌వ్ రూపంలో చూడ‌బోతున్నాం. ఆ మేర‌కు సోష‌ల్ మీడియాలో న్యూస్ వైర‌ల్ అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున అంజూయాద‌వ్ పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. అయితే, ఆమె ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? అనేది మాత్రం సందిగ్ధం.

ఎన్నిక‌ల్లోనూ స‌ర్కిల్ ఇన్ స్సెక్ట‌ర్ అంజూయాద‌వ్.(Political Policing)

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక వేళ తిరుప‌తి నుంచి పోటీ చేస్తే ఆయ‌న మీద అంజూ యాద‌వ్ పోటీ చేస్తార‌ని (Political Policing) తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని వినికిడి. గ‌త ఎన్నిక‌ల్లో భీమవ‌రం, గాజువాక నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ ఓడిపోయారు. ఈసారి అప్ప‌ట్లో చిరంజీవి గెలిచిన తిరుప‌తి నుంచి పోటీకి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన ఓడిన భీమ‌వ‌రంతో పాటు తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీకి సిద్ధ‌మ‌వుతున్నార‌ని జ‌న‌సేనలోని టాక్‌. అదే నిజ‌మైతే, అంజూయాద‌వ్ తిరుప‌తి నుంచి పోటీకి వైసీపీ త‌ర‌పున దిగే ఛాన్స్ ఉంది.

అంజూ యాద‌వ్ ను రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ఏ మాత్రం రాజ‌కీయ నేప‌థ్యంలేని నందిగం సురేష్ ను బాప‌ట్ల ఎంపీగా చేశారు జ‌గ‌న్మోహన్ రెడ్డి. అమ‌రావ‌తి భూముల విష‌యంలో పోరాడి పోలీసుల దెబ్బ‌లు.(Political Policing) తిన్నందుకు గిఫ్ట్ గా బాప‌ట్ల ఎంపీగా పోటీ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అనంత‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్ మీద గ‌త ఎన్నిక‌ల్లో మీసం మెలేసిన స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ గోరంట్ల మాద‌వ్ ను ఎంపీగా గెలిపించారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఫిజియోథెర‌పీ చేసి సేవ‌లు అందించిన డాక్ట‌ర్ తిరుప‌తి ఎంపీగా నిలిపి గురుమూర్తిని గెలిపించారు. అదే త‌ర‌హాలో ఈసారి అంజూ యాద‌వ్ ను రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యించుకున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

క‌డప జిల్లాకు చెందిన అంజూ యాద‌వ్ పోలీస్ ఆఫీసర్

క‌డప జిల్లాకు చెందిన అంజూ యాద‌వ్ పోలీస్ ఆఫీసర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి వివాద‌స్ప‌ద‌మే. ఆమెకు కొన్ని సంఘ‌ట‌న‌ల్లో మంచిపేరు వ‌చ్చింది. క‌డ‌ప జిల్లా నంది మండలంకు చేందిన ఓబన్న, అనంతమ్మ దంపతులకు అంజూ యాదవ్ త‌ల్లిదండ్రులు. సామాన్య వ్యవసాయ కుటుంబం కావ‌డంతో బాల‌య్యం నుంచి అనేక కష్టాల మధ్య ఆమె పెరిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, చ‌దువుపై మ‌క్కువ‌తో కసిగా సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చ‌దివారు. ఆ త‌రువాత ఉద్యోగం కోసం నేష‌న‌ల్ బ్యాంక్స్, ఎల్ఐసీ, ఎస్సై పోటీ పరిక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. తొలి నుంచి డేరింగ్. అండ్ డాషింగ్ గా ఉండే అంజూ యాదవ్ ‌పోలీసు ఉద్యోగం ఎంచుకున్నారు. తొలుత 1998లో చిత్తూరు జిల్లా, ఐరాల మండలం పోలీసు స్టేషనుకు ఎస్ఐగా నియామ‌కం అయ్యారు. ముక్కుసూటిగా ఉండే ఆమెకు విధి నిర్వ‌హ‌ణలో ఒత్తుడులు  (Political Policing)రావ‌డంతో కొంతకాలం సెలవుపై వెళ్లారు.

Also Read : Janasena Strategy : BJP గేమ్ లో ఆట‌గాడు

విదేశాలలో ఉన్న సోద‌రి వ‌ద్ద‌కు వెళ్లాల‌ని అంజూయాద‌వ్ ప్రయత్నించారు. కానీ వీసా రాక‌పోవ‌డంతో తిరిగి పోలీసు అధికారిగా విధుల్లో చేరారు. ఎవరిని లెక్క చేయని ఆమె లేడీ గబ్బర్ సింగ్ గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిడులకు లొంగని ఆమె విధి నిర్వ‌హ‌ణ‌లో ఒడిదుడుకులు అనేకం ఎదుర్కొన్నారు. అందుకే, ఆమెను వ‌ద్ద‌ని పోలీసు ఉన్నతాధికారులకు బడా రాజకీయ నాయకులు అభ్య‌ర్థించే వాళ్లట‌.

మాజీ సీఎం చంద్ర‌బాబు మీద తిరుప‌తి అలిపిరి వ‌ద్ద జ‌రిగిన న‌క్స‌ల్ దాడి ఘ‌ట‌న ఆమెను వీరోచిత పోలీస్ ఆఫీస‌ర్ గా నిలిపింది. అలిపిరి వద్ద 2003 అక్టోబరు 1న కాన్వాయ్‌పై క్లైమోర్‌ మైన్స్‌ పేల్చిన ఘటనలో చంద్ర‌బాబు కారుపైకి ఎక్కి సూపర్‌ కాప్‌గా అంజూ యాదవ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అప్ప‌టి నుంచి ఆమె ముక్కుసూటిత‌నం మ‌రింత పెరిగింది. వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారారు. తాజాగా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త కొట్టే సాయిని చెంపలు (Political Policing) వాయ‌కొట్టారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యారు. తిరుప‌తి ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి వ‌ద్ద‌కు ర్యాలీగా వెళ్లిన ప‌వ‌న్ పోలీస్ అధికారి అంజూయాద‌వ్ మీద ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక వేళ తిరుప‌తి నుంచి పోటీ చేస్తే ఆయ‌న మీద అంజూ యాద‌వ్ పోటీ (Political Policing)

మ‌రోసారి వివాద‌స్ప‌ద రీతిలో తెర‌పైకి వ‌చ్చిన అంజూయాద‌వ్ రాబోయే రోజుల్లో పొలిటిక‌ల్ ఎంట్రీ  (Political Policing)ఇస్తున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న స‌మాచారం. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ ను నిలువ‌రించ‌డం ద్వారా ఆమె వివాద‌స్పదం అయ్యారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా జ‌న‌సేన చేసిన ధ‌ర్నా సంద‌ర్భంగా జరిగిన ఘ‌ట‌న అంజూయాద‌వ్ ను రాజ‌కీయ ప్ర‌వేశం దిశ‌గా మ‌ళ్లిస్తోంది. పైగా క‌డ‌ప జిల్లాకు చెందిన పోలీస్ ఆఫీస‌ర్. ఇంకేముంది, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఖ‌చ్చితంగా ప‌వ‌న్ మీద పోటీకి నిలుపుతార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Jagan : అమ్మాయిలను లోబర్చుకొని పెళ్లిచేసుకోవడం.. నాలుగేళ్లు కాపురం చేసే వదిలేయడం ఇదే దత్తపుత్రుడి క్యారెక్టర్ – జగన్

ఎక్కువ కాలం తిరుపతి జిల్లాలో పని చేసిన కారణంగా సీఐ అంజూ యాదవ్ కు ప‌రిచ‌యాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అందుకే, తిరుప‌తి నుంచి పోటీకి దిగుతార‌ని తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా కాపు వ‌ర్సెస్ యాద‌వ్ సామాజిక‌వ‌ర్గ యుద్ధం ప్ర‌చ్ఛ‌న్నంగా ఉంద‌ని అంద‌రికీ తెలిసిందే. కాపు సామాజిక‌వ‌ర్గంకు చెందిన ప‌వ‌న్ తిరుప‌తి నుంచి పోటీ చేస్తే, అంతే బ‌లమున్న యాద‌వ్ సామాజిక‌వ‌ర్గంకు చెందిన అంజూయాద‌వ్ ను బ‌రిలోకి దింప‌డానికి వైసీపీ ఫిక్స్ అయింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని టాక్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో తిరుప‌తి నుంచి పోటీ చేయాలా? వ‌ద్దా? అనేది ప‌వ‌న్ తేల్చుకోవాల్సి ఉంది.