Pavan Kalyan Politics: చంద్రవ్యూహంలో ‘పవన్ ‘

మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం.

  • Written By:
  • Updated On - September 1, 2022 / 11:35 AM IST

మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు రెండే ఆప్షన్లు మిగిలాయి. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం. లేకపోతే ఒంటరిగా బరిలోకి దిగడం. అంటే నాలుగు నెలల క్రితం పవన్ చెప్పిన మూడు ఆప్షన్లు రెండుకు తగ్గడం వెనుక బాబు మార్క్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ తనకు తాను వస్తే సీట్లు ఎన్నో ఆయన అడగలేరు. ఇచ్చినవి తీసుకోవడమే ఆయనకు ఆప్షన్. అంటే డిమాండ్ చేసే స్థితి నుంచి జనసేన కూటమిలో చేరే అనివార్యత వచ్చిందన్నమాట. దటీజ్ బాబు చాణక్యం.
జగన్ మళ్ళీ సీఎం కాకూడదు అని పంతం పట్టిన పవన్ కచ్చితంగా టీడీపీ బీజేపీ కూటమిలో చేరక తప్పదు. అదే కనుక జరిగితే ఎన్నో కొన్ని సీట్లు (10వరకు)మాత్రమే పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయి. ఇక సీఎం ఎవరు అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగవ సారి బాబు కావడానికి ఎటూ బీజేపీ సిద్ధం అవుతున్న వేళ జనసేన జై కొట్టాల్సిందే. ఏపీ రాజకీయం చూస్తే ప్రస్తుతం అలాగే ఉంది.
జనసేనకు ఇప్పటి వరకు గుర్తింపు లేదు. ఆ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు ఉందో కూడా తెలియదు. అయినప్పటికీ సీఎం పదవి షేరింగ్ వరకు ఆ పార్టీ వెళ్ళింది. అందుకే ముందే మేల్కొన్న చంద్రబాబు బీజేపీకి దగ్గర అయ్యారు. దీంతో జనసేన ఇటీవల ఉతికినెక్కడం తగ్గించింది.

 

Also Read: Ananthapur : ఎస్పీ,అదనపు ఎస్పీ,డీఎస్పీలపై కేసులు నమోదు..!!

 

2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా పోటీ చేయరాదు అని 2019లో వచ్చిన దారుణ ఫలితాలను చూసిన తరువాత బాబు గట్టి నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే దాన్ని అమలులో పెట్టడానికి ఆయన ఒక వ్యూహాన్నే అనుసరించారు. ఫలితంగా చంద్రబాబు బీజేపీని తనతో పొత్తుల కోసం తిరిగి రప్పించుకోవాలనుకున్నారు. అయితే పవన్ బీజేపీ మిత్ర బంధం అంత సాఫీగా సాగినట్లుగా కనిపించలేదు అంటారు. పేరుకు మాత్రమే అన్నట్లుగానే ఉంది అని చెబుతారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయాన్ని అతిగా ఊహించుకుని మొత్తం కూటమికే పెద్దన్న కావాలని అనుకున్నారని చెబుతారు. అందుకే ఆయన జనసేన ఆవిర్భావ సభలో అన్ని పార్టీలు తగ్గాలి. వైసీపీ వ్యతిరేక కూటమికి సహకరించాలని ఒక పిలుపు ఇచ్చారు. అంటే తన నాయకత్వాన అటు తెలుగుదేశం ఇటు బీజేపీ చెరో వైపున చేరి కూటమి కడితే తాను పెద్దన్న కావచ్చు అని ఆయన బహుశా భావించి ఉంటారు. ఆ తరువాత కూడా ఆయన తెలుగుదేశంతో పొత్తు మీద కొన్ని కామెంట్స్ చేశారు. అధికార వాటా కోసం కూడా జనసేన నాయకులు మాట్లాడారు. మొత్తానికి ఏదైతేనేమి జనసేనతో నేరుగా పొత్తు అన్నది వల్ల కాదేమో అన్న భావన అయితే టీడీపీకి కల్పించారు అని ఒక విశ్లేషణ ఉంది. జనసేన బీజేపీ కూటమికి పవన్ సీఎం అని ప్రకటించాలని జనసైనికులు చేసిన డిమాండ్లు కూడా కమలం పార్టీకి నచ్చినట్లుగా లేదు. దాంతో వారు కూడా పవన్ని పక్కన పెట్టి బాబుతో డైరెక్ట్ గానే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఊహించారో లేదో తెలియదు కానీ మోడీ చంద్రబాబు షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకున్నారు. ఇక తొందరలో రెండు పార్టీలు కూడా కలవబోతున్నాయని టాక్. ఈ పరిణామాలతోనే పవన్ కొంత కలత చెందారని అంటున్నారు. అందుకే ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను నరేంద్ర మోడీ చెబితేనే టీడీపీకి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. టీడీపీ మీద తనకు ప్రత్యేకమైన ప్రేమలు ఏవీ లేవని అలా ఆయన చెప్పారన్నమాట.

 

Also Read: Political Alliance: టీడీపీ, బీజేపీ ‘పొత్తు’ భారతం

 

అటు బీజేపీ ఇటు టీడీపీ రెండూ కలవాలనుకుంటున్నాయి. ఇక్కడ బాబు ఏపీకి తదుపరి సీఎం అయినా బీజేపీకి ఓకే. అక్కడ మోడీని మూడవసారి ప్రధాని చేయడానికి టీడీపీ కూడా రెడీగా ఉంది. ఈ కొత్త పొత్తు వల్ల వైసీపీకి చేదు కషాయం తాగిద్దామన్న అజెండా ఉన్నా మధ్యలో మిత్రుడు పవన్ కూడా పొలిటికల్ గా ఇబ్బంది పడతారా అన్న చర్చ ఒకటి బయల్దేరింది.
తనకు మూడు ఆప్షన్లు అని చెబుతూ వచ్చిన పవన్ కి ఇపుడు రెండే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఒకటి టీడీపీ బీజేపీ కూటమితో తానుగా ముందుకు వచ్చి పోటీ చేయడం. లేకపోతే ఒంటరిగా పోటీ చేయడం. అంటే పవన్ ముందున్న మూడు ఆప్షన్లు రెండుగా చేయడంతో బాబు మార్క్ పాలిటిక్స్ సక్సెస్ అయింది.

 

Also Read: AP Constable: కానిస్టేబుల్ ప్రకాష్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి : టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

 

ఎటూ జగన్ మళ్ళీ సీఎం కాకూడదు అని పంతం పట్టిన పవన్ కచ్చితంగా టీడీపీ బీజేపీ కూటమిలో చేరక తప్పదనే అంటున్నారు. అదే కనుక జరిగితే ఎన్నో కొన్ని సీట్లు మాత్రమే పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయి. ఇక సీఎం ఎవరు అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు నాలుగవ సారి బాబు సీఎం కావడానికి బీజేపీ సిద్ధం అయిన వేళ జనసేన కూడా సై అనాల్సిందే.