Political Murder : వివేకా మ‌ర్డ‌ర్ లో`స‌జ్జ‌ల`రాజ‌కీయ మాయ‌

వివేకా నంద‌రెడ్డి హ‌త్యలోని కీల‌క సూత్ర‌ధారి అవినాష్ రెడ్డి గా (Political Murder)సీబీఐ తేల్చ‌డంతో స‌జ్జ‌ల మీడియా ముందుకొచ్చారు.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 05:18 PM IST

మాజీ మంత్రి వివేకా నంద‌రెడ్డి హ‌త్యలోని కీల‌క సూత్ర‌ధారి అవినాష్ రెడ్డి గా  (Political Murder) సీబీఐ తేల్చ‌డంతో జ‌రుగుతోన్న రాజ‌కీయ న‌ష్టాన్ని నివారించ‌డానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చారు. గంట పాటు ఆయ‌న ప‌లు ర‌కాల వివ‌ర‌ణ‌ల‌ను ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. సీబీఐ చేసిన ద‌ర్యాప్తును త‌ప్పుబడుతూ హ‌త్యను టీడీపీ, మాజీ నిఘాధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీద నెట్ట‌డానికి స‌జ్జ‌ల ప్ర‌య‌త్నం చేయ‌డం విచిత్రం. అన్ని కోణాల నుంచి ద‌ర్యాప్తు చేసిన సీబీఐ చార్జిషీట్ లో క్లియ‌ర్ గా ఎంపీ అవినాష్ రెడ్డి సూత్ర‌ధారంటూ తేల్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ హ‌త్య కేసు ప్ర‌భావం వైసీపీపై ప‌డుతుంద‌న్న ఆందోళ‌న ఆ పార్టీలో మొద‌లైయింది. దీంతో స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి మునుపెన్న‌డూ లేనివిధంగా సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

హ‌త్యను టీడీపీ, మాజీ నిఘాధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీద నెట్ట‌డానికి స‌జ్జ‌ల ప్ర‌య‌త్నం (Political Murder)

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుపై సీబీఐ వేసిన చార్జిషీట్ ల‌ను వైసీపీ త‌ప్పుబ‌డుతోంది. ద‌ర్యాప్తు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతోంది. ఇదంతా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు జ‌రుగుతోంద‌ని అభాండాల‌ను మోపుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియాకు ఎక్కారు. కుటుంబంలోని స‌భ్యులు ఫోన్లు చేసుకోవ‌డం త‌ప్పా? అంటూ ప్ర‌శ్నించారు. మ‌ర్డ‌ర్ జ‌రిగిన రోజు ఫోన్లు మాట్లాడుకోవడం అస‌హ‌జం కాద‌ని చెప్పుకొచ్చారు. సీబీఐ ద‌ర్యాప్తు అంతా త‌ప్ప‌ని.(Political Murder) కొట్టిపారేశారు.

సీబీఐ ద‌ర్యాప్తు అంతా త‌ప్ప‌ని కొట్టిపారేశారు.

హ‌త్య‌కు రెండో వివాహం, ఆర్థిక స‌మ‌స్య‌లు, చంద్ర‌బాబు వ్యూహం అంటూ స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మీడియా ముందు ప‌లు అంశాల‌ను బ‌య‌ట‌పెట్టారు. గుగూల్ టేకౌట్ ద్వారా ఆధారాల‌ను సీబీఐ రాబ‌ట్ట‌లేకపోయింద‌ని చెప్పుకొచ్చారు. వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతా రెడ్డి ఇప్పుడు చంద్ర‌బాబు హోల్డ్ లో ఉన్నార‌ని అప‌వాదులు మోపారు. ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లు ఏడు ర‌కాలుగా ఉన్నాయంటూ చెబుతూ చంద్ర‌బాబు డైరెక్ష‌న్లో అంతా న‌డుస్తోంద‌ని ఆరోపించారు. హ‌త్య‌కు కార‌కులుగా మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, బీటెక్ ర‌వి అంటూ చెబుతూ  (Political Murder) ప్ర‌స్తుత ద‌ర్యాప్తును త‌ప్పుబ‌ట్ట‌డం విచిత్రం.

రామ‌క్రిష్ణారెడ్డి, వైఎస్ భార‌తి మ‌ధ్య న‌డిచిన వాట్స‌ప్ చాట్ ల‌ను

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల్లో అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు ఆదినారాయ‌ణ రెడ్డి, బీటెక్ ర‌వి ఉన్నారు. కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబానికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. ఎప్పుడూ హ‌త్యా రాజ‌కీయాల వైపు టీడీపీ లీడ‌ర్లు వెళ్లిన దాఖ‌లాలు లేవు. కానీ, ఇప్పుడు మాజీ వివేకానంద‌రెడ్డి హ‌త్య ను టీడీపీ లీడ‌ర్ల వైపు తిప్ప‌డానికి  (Political Murder) వ్యూహాన్ని సజ్జ‌ల ర‌చించారు. సీబీఐ ద‌ర్యాప్తు, వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీతారెడ్డి, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ప్ర‌మేయాన్ని అనుమానిస్తున్నారు. ఆ మేర‌కు సీబీఐ విచార‌ణ‌లో వాగ్మూలాన్ని కూడా ఇచ్చారు. వాళ్లిచ్చిన స్టేట్మెంట్ ల. ఆధారంగా సీబీఐ చార్జిషీట్ వేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని సీబీఐ విచార‌ణ చేసిన త‌రువాత వేసిన చార్జిషీట్ లో పొందుప‌రిచారు.

Also Read : Viveka Murder Case: సిబిఐ డైరెక్టర్ కు అవినాష్ రెడ్డి లేఖ

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగిన త‌రువాత స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, వైఎస్ భార‌తి మ‌ధ్య న‌డిచిన వాట్స‌ప్ చాట్ ల‌ను డాక్ట‌ర్ సునీతారెడ్డి బ‌య‌ట‌పెట్టారు. ఆమె ఇచ్చిన చాట్ ల ఆధారంగా సీబీఐ చార్జిషీట్ ను వేసింది. కానీ, సునీతారెడ్డి చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని స‌జ్జ‌ల మీడియాకు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మాజీ మంత్రి వివేకా హ‌త్య వెనుక ఉన్న కార‌ణాల‌ను ప‌లు ర‌కాలు చెప్పారు. ప్ర‌ధానంగా రెండో వివాహం, ఆర్థిక అంశాలు, సెటిల్మెంట్ లు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. ద‌స్త‌గిరిని అప్రూవ‌ర్ గా ఎందుకు మార్చాల్సిన అవ‌సరం ఉంద‌ని సీబీఐని నిల‌దీశారు. సీబీఐ విచార‌ణ‌, అధికారులు అడగాల్సిన ప్ర‌శ్న‌ల‌ను తెలియ‌చేశారు. సీబీఐ అధికారులు చేసిన విచార‌ణ స‌రిగా లేద‌ని ఆరోపించారు.

Also Read : Viveka Murder : తాడేపలి రాణివాసంపై..స్క్రీన్ షాట్ ! వివేకా మ‌ర్డ‌ర్ ట్విస్ట్

రాజ‌కీయంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని దెబ్బ‌తీయ‌డానికి ఇలాంటి ప‌రిస్థితుల‌ను చంద్ర‌బాబు తీసుకొచ్చార‌ని ఆరోపించారు. సీబీఐ ద‌ర్యాప్తు అంతా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు జ‌రుగుతుంద‌ని స‌జ్జ‌ల విమ‌ర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించ‌డం ద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో ఏదో ల‌బ్దిపొందాల‌ను చంద్ర‌బాబు చూస్తున్నార‌ని ఆరోపించారు. చ‌నిపోయిన వివేకానంద‌రెడ్డి గౌర‌వం కాపాడాల‌ని తాము చూస్తున్నామ‌ని స‌జ్జ‌ల ముక్తాయించారు. బ‌తికున్న వాళ్ల‌ను కూడా బ‌జారుకీడ్చ‌డానికి డాక్ట‌ర్ సునీతారెడ్డి సిద్ద‌ప‌డ్డార‌ని ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక టీడీపీ నేత‌లు ఉన్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లకు (Political Murder) సజ్జ‌ల తెర‌లేపారు. అప్ప‌ట్లో ఉన్న ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించ‌డం కొస‌మెరుపు.