Site icon HashtagU Telugu

Chandrababu Arrest: ఇది కేవలం కక్షసాధింపు చర్య.. చంద్రబాబుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జగన్ లక్ష్యం: బాలకృష్ణ

Chandrababu Arrest:

Reaction

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ (Chandrababu Arrest) చేయడాన్ని టీడీపీ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి. రాత్రికి రాత్రే చంద్రబాబుని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవిధంగా తీర్చుకోవడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక చీకటి రోజు అని ఎంపీ రఘు రామకృష్ణ రాజు పేర్కొన్నారు.

బాలకృష్ణ రియాక్షన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నాడు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమన్నారు. ‘‘నేను 16 నెలలు జైల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు నిరసనకు పిలుపునిచ్చారు. దీనితో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుని హౌస్ అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కడపలో టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్వీట్ చేశారు.

చంద్రబాబు అరెస్టు వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు 14సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపించకుండా పోలీసులు అరెస్ట్ చెయ్యడం వైసీపీ పాలనకు అద్దం పడుతోందన్నారు.