AP : ఈ ముహూర్తాలలో అభ్యర్థులు నామినేషన్లు వేస్తే గెలుపు మీదే..!!

దేశ వ్యాప్తంగా లోక్ సభ తో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు తమకు ఏ రోజు అనుకూలంగా ఉంది..? ఎప్పుడు బాగుంది..? ఏ రోజు ఎంచేయొచ్చు..? అనేవి చూసుకొనే పనిలో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 05:36 PM IST

టెక్నాలజీ (Technology) ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ..ముహూర్తం చూసుకొనే ఏ పనైనా మొదలుపెడతాం. చందమామ ఫై అడుగుపెట్టిన మన ఇస్రో కూడా ముందుగా దేవుడి దగ్గర మొక్కుకొని , మంచి ముహూర్తం చూసుకొనే ఏ ప్రయోగమైన మొదలుపెడతారు. అలాంటిది మన రాజకీయ నేతలైతే అన్ని ముహుర్తాలు చూసుకునే చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. దేశ వ్యాప్తంగా లోక్ సభ తో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీల నేతలు తమకు ఏ రోజు అనుకూలంగా ఉంది..? ఎప్పుడు బాగుంది..? ఏ రోజు ఎంచేయొచ్చు..? అనేవి చూసుకొనే పనిలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీ విషయానికి వస్తే..ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లను (Nominations) ఎన్నికల కమిషన్ స్వీకరించబోతుంది. ఈ క్రమంలో బరిలోకి దిగుతున్న నేతలు ఈరోజు ముహూర్తం బాగుంది..దానిని బట్టి తమ నామినేషన్ ను దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారు. అయితే రేపు18 (గురువారం) దశమి, ఆశ్లేష నక్షత్రం, 19న శుక్రవారం ఏకాదశి, మఖ నక్షత్రం ఉన్నందున ఈ రెండు రోజుల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే బాగా కలిసి వస్తుందని పండితులు చెపుతున్నారు. అలాగే 24న బుధవారం పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం కూడా చాలా బాగుంది అని, ఆ రోజూ కూడా నామినేషన్లు వేస్తే లాభం జరుగుతుందని చెబుతున్నారు. ఈనెల 21న త్రయోదశి, ఉత్తర నక్షత్రం… అన్నింటికంటే ఈ రోజు ఇంకా బాగుందని తెలిపారు. అందుకే ఈనెల 21న లక్షల పెళ్లిళ్లకు ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్నారు. 21న ఆదివారం సెలవు రోజు కాబట్టి నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం లేదు. దాంతో ఆ రోజు కూడా నామినేషన్లకు ఈసీ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. అభ్యర్థులు తమ జాతకం ప్రకారం మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఎవరికీ ఏ ముహూర్తం కలిసి వస్తుందో చూడాలి.

ఈసారి ఏపీలో ఎన్నికలు గట్టిగా ఉండబోతున్నాయి. జగన్ ను గద్దె దించేందుకు మురు పార్టీ లు టిడిపి , జనసేన, బిజెపి కలిసి బరిలోకి దిగుతున్నాయి. అటు అన్నను ఓడించేందుకు షర్మిల సైతం సై అంటుంది. మరి ఇంత మంది బరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Read Also : PM Modi: కాంగ్రెస్ 60 ఏళ్లలో చేయలేనిది బీజేపీ పదేళ్లలో చేసింది : పీఎం మోడీ