ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో నటించడం మరోసారి చర్చనీయాంశమైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ (Vijaykumar) హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరగగా, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని, ఇదే విషయంపై గతంలో ఎన్టీఆర్ కేసులో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో పవన్ కల్యాణ్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కూడా ఏజీ పేర్కొన్నారు.
BRS : సీఎం రేవంత్‌కు మతి భ్రమించిందా?..బీఆర్ఎస్ నేత పుట్ట మధు తీవ్ర విమర్శలు
ఇక పిటిషనర్ తరఫున న్యాయవాది బాల మాట్లాడుతూ.. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనడం అనైతికమని వాదించారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలను వ్యక్తిగత సినిమాల కోసం వినియోగించడం ప్రజా ధన దుర్వినియోగమని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించడం, సినిమాల్లో నటించడం రెండూ పరస్పర విరుద్ధమైన పనులని న్యాయవాది వాదించారు. దీనిపై హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి రిప్లై వాదనల కోసం విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
అంతేకాకుండా పవన్ కల్యాణ్‌పై ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ పరిపాలనపై కన్నా సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ మండిపడుతూ ఇతర రాజకీయ నేతలు పత్రికలు, టీవీలు, బినామీ కంపెనీలు, వ్యాపారాలు నడపడం సాధారణమైపోయిందని, తాను సినిమాలు చేస్తే తప్పు ఎందుకని ప్రశ్నించారు. తాను ఆస్తులు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే షూటింగ్‌లు పూర్తవ్వాల్సి ఉన్నా రాజకీయ పరిణామాల వల్ల ఆలస్యమైందని ఆయన వివరించారు.