Political game : నమ్మండి ప్లీజ్, మాకు సంబంధాల్లేవ్!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు వేదిక‌గా చేసిన ఒకేఒక కామెంట్ చుట్టూ రాజ‌కీయాన్ని(Political game) బీజేపీ తిప్పుతోంది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 03:33 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ల్నాడు వేదిక‌గా చేసిన ఒకేఒక కామెంట్ చుట్టూ రాజ‌కీయాన్ని(Political game) బీజేపీ తిప్పుతోంది. ఏనాడూ వైసీపీతో సంబంధంలేద‌ని సోమువీర్రాజు(somu veerraju) చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఒక ఎంపీ జీవీఎల్, పురంధరేశ్వ‌రి త‌దిత‌ర ఏపీ నేతలు వైసీపీతో సంబంధాల‌పై మాట్లాడేందుకు పోటీప‌డుతున్నారు. వారం క్రితం వ‌ర‌కు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన వైసీపీ, బీజేపీ నేత‌లు ఇప్పుడు విభేదించుకుంటున్నారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

ఒకేఒక కామెంట్ చుట్టూ రాజ‌కీయాన్ని(Political game)

రాజ‌కీయాల్లో అవ‌స‌రాలు (Political game)మాత్ర‌మే ఉంటాయ‌ని గ‌త కొన్నేళ్లుగా చూస్తున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా పొత్తులు పెట్టుకున్న పార్టీల‌ను చూశాం. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తును ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. అలాంటిది 2018 అసెంబ్లీ, 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చూశాం. అలాగే, బీజేపీ దేశ వ్యాప్తంగా ప‌లు పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది. మ‌హ‌బూబాముక్తీ పార్టీతోనూ జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుకు భాగ‌స్వామ్యం అయింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా ఎన్డీయే భాగ‌స్వాముల‌ను పెంచుకోవ‌డానికి బ‌ద్ధ శ‌త్రువుల‌నైనా కౌగిలించుకోవ‌డానికి బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది.

ఎన్డీయేలో భాగస్వామి కావాల‌ని వైసీపీని బీజేపీ కోరింద‌ని

తొలుత ఎన్డీయేలో భాగస్వామి కావాల‌ని వైసీపీని బీజేపీ కోరింద‌ని ఆ మ‌ధ్య వ‌చ్చిన టాక్‌. కానీ, క్రిస్టియ‌న్ మైనార్టీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని వైసీపీ(Political game) సున్నితంగా తిర‌స్క‌రించింది. అదే స‌మ‌యంలో భాగస్వామి కావ‌డానికి సిద్ధంగా ఉన్న టీడీపీ వైపు బీజేపీ చూసింది. కానీ, బెట్టుగా ఉంటే నాలుగు సీట్లు ఎక్కువ పొత్తులో అడ‌గ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఎత్తుగ‌డ వేసింది. ఓప‌న్ ఆఫ‌ర్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి బీజేపీకి ఉన్న‌ప్ప‌టికీ గేమాడుతోంది. జ‌న‌సేన‌తో పొత్తుకు వెళతామంటూ పావులు క‌దిపింది. అదే స‌మ‌యంలో వైసీపీతో (YCP)ఎలాంటి సంబంధాలు లేవ‌నే సంకేతాన్ని బ‌లంగా పంపిస్తోంది.

బీజేపీ, వైసీపీ ఇచ్చిపుచ్చుకుంటూ గ‌త నాలుగేళ్లుగా   గేమాడాయి

వాస్త‌వంగా బీజేపీ, వైసీపీ ఇచ్చిపుచ్చుకుంటూ గ‌త నాలుగేళ్లుగా ఏపీ అభివృద్ది మీద గేమాడాయి. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను బీజేపీ పెద్ద‌ల‌కు చెప్ప‌కుండా చేయ‌మ‌ని తొలి రోజుల్లోనే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. అదే విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) కూడా ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. పార్ల‌మెంట్ వేదిక‌గా తీసుకున్న 370 ర‌ద్దు, సీఏఏ, వ్య‌వ‌సాయ బిల్లుల‌కు సైతం వైసీపీ పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తు ఇచ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ప్పుడు కూడా వైసీపీ భేర‌తుగా అండ‌గా నిలిచింది. ప్ర‌తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కేసుల నుంచి బీజేపీ పెద్ద‌లు త‌ప్పిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులోని నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా చ‌క్రం తిప్పార‌ని(Political game) స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

క్రిస్టియ‌న్, ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు చెదిరింది (Political game)

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిధుల‌ను ఏపీకి విడుదల చేసింది. ఎఫ్ ఆర్ బీఎం ప‌రిమితులు దాటిన త‌రువాత కూడా అప్పులు తీసుకోవ‌డానికి కేంద్రం అనుమ‌తిని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పొందారు. పోల‌వ‌రం(polavaram) ఎత్తును త‌గ్గించడానికి, విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను బహిరంగ వేలం ద్వారా ప్రైవేటుకు అప్ప‌గించ‌డానికి కేంద్రానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హ‌క‌రించారు. అంతేకాదు, వ్య‌వ‌సాయ మోటార్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించడానికి కూడా కేంద్రం చెప్పిన‌ట్టు త‌లాడించారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాల మధ్య (Political game) న‌డుస్తోంది. గ‌త నాలుగేళ్లుగా ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న బంధాన్ని స‌గ‌టు ఓట‌రు అర్థం చేసుకున్నారు. ఫ‌లితంగా వైసీపీకి ఉన్న క్రిస్టియ‌న్, ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు చెదిరింది. మ‌రో ఛాన్స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇవ్వ‌డానికి ఆ సెక్టార్ సిద్ధంగా లేద‌ని స‌ర్వేల సారాంశమ‌ని వినికిడి. అందుకే, వైసీపీ, బీజేపీ వేర్వేరు అనే అభిప్రాయం క‌లిగించ‌డానికి ప్ర‌య‌త్నం జరుగుతోంది.

Also Read : Vijayawada:కేశినేని YCPలోకి?బెజ‌వాడ రాజ‌కీయ ర‌చ్చ‌

అటు బీజేపీ ఇటు వైసీపీ నేత‌లు ఎంత చెప్పిన‌ప్ప‌టికీ ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న ఫెవికాల్ బంధాన్ని స‌గ‌టు ఓట‌రు కాద‌న‌డ‌లేక‌పోతున్నాడు. బ‌లీయ‌మైన బంధాన్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని చ‌ర్చించుకుంటున్నారు. మూడు రాజ‌ధానుల‌కు ప‌రోక్షంగా బీజేపీ స‌హకారం అందించింద‌ని ఏపీ పౌరులు చెప్పుకుంటున్నారు. బీజేపీ డ‌బుల్ గేమాడుతూ రాష్ట్రాన్ని అధోగ‌తిపాలు చేసింద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌ల కోసం రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని చెప్పుకోవ‌డానికి పోటీప‌డ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jagan Once more :`మ‌రో ఛాన్స్`దిశ‌గా జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్