Site icon HashtagU Telugu

Chandrababu: పొలిటికల్ పండగ.. ఇక చంద్రబాబు దూకుడు

Krishna District

chandrababu naidu

జగన్, కెసిఆర్ వీరిద్దరి ని పెను పిశాచిలాగా వెంటాడుతున్న కర్మఫల సిద్ధాంతం (రిటర్న్ గిఫ్ట్) చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వామ పక్షాల రూపంలో తరుముకొస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు. 2019లో జరిగిన ఎన్నికలలో కెసిఆర్ , జగన్ జోడి తెలుగుదేశానికి భారీ షాక్ ఇచ్చింది. అంతేకాదు బహిరంగంగా కేసీఆర్ రిటన్ గిఫ్ట్ ఇస్తామని ఎలక్షన్ ప్రచారంలో స్పష్టం చేయడం జరిగింది. ఎల్లకాలం కాలము ఒకేలా ఉండదు.బీఈ సృష్టిలో ప్రకృతికి అనుకూలంగా కాలం మారుతూనే ఉంటుందని ఆ కాలం ఇప్పుడు చంద్రబాబు చుట్టూ తిరుగుతుందని టీడీపీ బ్యాచ్ నమ్మకం.మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా సహాయపడ్డాడో ప్రస్తుతం చంద్రబాబునాయుడుకి అనుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించే ఆలోచనలో ఉన్నారట.

ఇంకేముంది, చంద్రబాబు కాలాన్ని పసిగట్టి రాజకీయ ట్రెండ్ సృష్టించాడు. రాజకీయ మాంత్రికుడు వేసిన గాలానికి బడా చేపలు చిక్కుతున్నాయని తమ్ముళ్లు సంబర పడుతున్నారు. జగన్కు 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమని పట్టం కట్టారు. జగన్ సర్కార్ అనునిత్యం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పై అవాకులు చావాకులు పేలుతూ ప్రజలలో చులకన అయిపోయింది. జగన్ క్యాబినెట్ కు చెందిన మంత్రులు, ఆయా శాఖలపై రివ్యూ చేయకుండా ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై రాజకీయ ఆరోపణలకు తెర లేపారు.. అంతవరకు ఆగకుండా అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుపై మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల మాటల దాడి చేయటమే కాకుండా చంద్రబాబు సతీమణి పై అసభ్యకరమైన పదజాలం వాడటం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జగన్ మంత్రివర్గంలో ఉన్న రాష్ట్ర మంత్రులు, కొందరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు కన్నీరు మున్నీరు అయ్యారు.

చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడు కంట కన్నీరు పెట్టలేదు. గత రెండు సంవత్సరాలు మహమ్మారి కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ప్రజల గుమ్మం గాని, తెలుగుదేశం మంచి చెడుల గురించి ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. తెలుగుదేశం యువ నాయకుడిగా ఉన్న నారా లోకేష్ ను పార్టీ సీనియర్ నేతలు గాని మాజీ మంత్రులుగాని ఏమాత్రం ఆహ్వానించడానికి ఇష్టపడలేదు. చంద్రబాబు నారా లోకేష్ పై ప్రతిరోజు టిట్టర్ ఫేస్బుక్ వైసీపీ సోషల్ మీడియా లో మంత్రులుగాని సజ్జల రామకృష్ణారెడ్డి గాని, విజయసాయిరెడ్డి, కొడాలి నాని, బందర్ నాని, మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయి మాట్లాడటంతో ప్రజలు తెలుగు దేశం పార్టీ పట్ల సానుభూతి వ్యక్తం చేయడమే కాకుండా ప్రజలలో పార్టీపై బాగా మైలేజీ పెరిగింది.

మరోవైపు ఎక్కడికక్కడే కార్యకర్తలు తెలుగుదేశం సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలు ఆగడాలను ప్రశ్నించడంతో ప్రభుత్వం ఆరోపణ తట్టుకోలేక కార్యకర్తలపై మాజీ మంత్రులపై సీనియర్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం తెలుగు దేశం పార్టీ కి మైలేజీ పెరిగింది. ఇంకో వైపు అధికార పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు నిత్యం జగన్ సర్కార్ తప్పులను ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించడం తో జగన్ సర్కార్కు కంటిమీద కునుకు లేకుండా చేసింది.కర్ణుడు చావుకు సవా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా కర్మ ఫలం జగన్ సర్కారును వివిధ రూపాల్లో అడుగడుగునా వెంటాడుతుందని టీడీపీ భావిస్తుంది.

గత ఏడాది నుండి తెలుగుదేశం నేతలు ఇదేమి కర్మ అనే కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళుతున్న తీరు ఆ పార్టీని స్వాగతించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేపట్టిన సభలకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో జగన్ పూనకాలతో వణుకు పట్టుకుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో చంద్రబాబు నాయుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జన సందోహం ఉవెత్తిన తరలి రావడంతో కెసిఆర్ కు ముచ్చెమట్ల పట్టుకున్నాయి. అంతేకాదు జనసందోహానికి.. జగన్ సర్కార్ ఒక్కసారిగా ఉలిక్కిపడి బ్రిటిష్ కాలం నాటి జీవోను తెరమీద తీసుకురావడంతో చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా బలం చేకూర్చింది. ఆ జీవో కారణంగా అన్ని పార్టీలు చంద్రబాబునాయుడు గొడుగు కిందకు చేరుతున్నారు.

అంతేకాదు తెలుగుదేశానికి బలమైన యువ నాయకుడు లోకేష్ ఒక్కడే అంటూ పార్టీ సీనియర్ నేతలు లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నారు. వైసిపి నేతల ఆరోపలపై లోకేష్ రాజకీయంగా బలం పుంజుకోటమే కాకుండా బాడీ లాంగ్వాజ్, పొలిటికల్ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకున్నాడు. ప్రజల వద్దకు రావడానికి యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.గత ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ చంద్రమనాయుడు కలయిక జగన్ సర్కారుకు ముచ్చమటలు పట్టించడమే కాకుండా తడిసి మోపుడు అవుతుంది.ఏదీ ఏమైనా రాష్ట్రంలో 2023 లో మధ్యంతర ఎన్నికలు తరుముకొస్తున్నయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పై రాజకీయ విశ్లేషకులు, ఢిల్లీ నుండి గల్లీ వరకు రాజకీయాలను పసిగడుతున్నారు. మొత్తానికి అనుకున్న కార్య నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తున్నారు.అసలు రాజకీయం మార్చి నెల నుండి ప్రారంభించడానికి బలమైన ప్రతిపక్ష నేత తన రాజకీయ అనుభవాన్ని జోడించి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు మాదిరిగా జగన్ సర్కార్ పోకడ విపక్షాలను ఒకటి చేసింది. సంక్రాంతి తరువాత ఇక ఏపీ రాజకీయాల తో పాటు తెలంగాణలోనూ టీడీపీ దూకుడు పెంచనుంది.