Political Dirty : ప‌వ‌న్, రోజా `తూ..భాష‌!`తూ.. మీ బ‌తుకుచెడ‌`కు ద‌గ్గ‌ర‌గా..!

నువ్వు కూడా నా గురించి మాట్లడతావా..ఛీ..నా బతుకు చెడ(Political Dirt) ప్రజల కోసం

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 04:20 PM IST

రెండు చోట్ల ఓడిపోయినోడు అంటూ ఆ డైమండ్ రాణి రోజా కూడా నా గురించి మాట్లాడుతోందే…! నువ్వు కూడా నా గురించి మాట్లడతావా… ఛీ… నా బతుకు చెడ(Political Dirt)! ప్రజల కోసం డైమండ్ రాణితోనైనా తిట్టించుకుంటా’ అని పవన్(pawan) అన్నారు. శ్రీకాకుళం వేదిక‌గా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై రోజా ట్విట్టర్ వేదికగా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ‘రెండు సార్లు గెలిచిన తాను… రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా?’ అని ప్రశ్నించారు. ‘తూ… ప్రజల కోసం తప్పడం లేదు’ (Political dirty)అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ప్యాకేజ్ స్టార్ అని విమర్శించారు. మొత్తం `తూ..మీ బతుకు చెడ` అంటూ విప‌క్షాల‌ను తిట్టే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే, `తూ…` అంటూ విచిత్ర తిట్ల పురాణానికి స్టార్లు రోజా, ప‌వ‌న్(pawan) దిగ‌డం భ‌విష్య‌త్ ఏపీ రాజ‌కీయ సంస్కృతిని ఆవిష్క‌రిస్తోంది.

‘తూ… ప్రజల కోసం తప్పడం లేదు’ (Political dirty)

టాలీవుడ్ హీరో, జ‌న‌సేనాని ప‌వన్, హీరోయిన్, మంత్రి రోజా అటు రాజ‌కీయ ఇటు సినిమా రంగాల్లో వాళ్ల‌కున్న‌ గ్లామ‌ర్ (Political Dirty) అంద‌రికీ తెలిసిందే. వెండితెర(film) మీద పాపుల‌ర్ న‌టులు. ఆ త‌రువాత రాజ‌కీయ రంగంలోనూ అదే పాపులారిటీని కంటిన్యూ చేస్తున్నారు. ఇంచుమించు ఒకేసారి రాజ‌కీయాల్లోకి ఇద్ద‌రూ అడుగు పెట్టారు. మంత్రి రోజా తెలుగుదేశం పార్టీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా రాజ‌కీయ ఆరంగేట్రం చేశారు. రెండుసార్లు ఆమె న‌గ‌రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Also Read : Minister Roja: చిరంజీవినే ఇంటికి పంపారు.. పవన్ కళ్యాణ్ ఎంత? మంత్రి రోజా!

ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున యువ‌రాజ్యం అధ్యక్షునిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి 2009 ఎన్నిక‌ల‌కు ముందుగా అడుగు పెట్టారు. వాళ్లిద్ద‌రూ 2009 ఎన్నిక‌ల్లో స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని పోటీప‌డి విమ‌ర్శించారు. ఒక పంచ‌లూడ‌గొడ‌తామంటే, మ‌రొక‌రు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల చెల్ల‌వంటూ ధ‌న‌య‌జ్ఞం గురించి వైఎస్ మీద పోటీప‌డి ఆరోప‌ణ‌లు చేశారు. సీన్ క‌ట్(film) చేస్తే, 2009 ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ పంచ‌న రోజా ప్ర‌త్య‌క్షంగా చేరిపోయారు. ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప‌రోక్షంగా ప‌వ‌న్ ఆ గూటి (Political Dirty) వాస‌న చూశారు.

2019 ఎన్నిక‌ల  చేగువీరా (pawan)

కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి 2014 ఎన్నిక‌ల ముందు ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె గెలుపొందారు. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో రెండోసారి గెలిచి మంత్రి అయ్యారు. అదే, ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌న‌సేన పార్టీ పెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పార్టీల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వంలో పరోక్షంగా భాగ‌స్వామ్యాన్ని పంచుకున్నారు. ఆనాడు రోజా మీద చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన స‌స్పెండ్ చేసింది. ప‌లు అవ‌మానాలను ఎదుర్కొన్నారు. కానీ, ఏనాడూ ప‌వ‌న్ స్పందించిన దాఖ‌లాలు లేవు. 2019 ఎన్నిక‌ల నాటికి చేగువీరా భావ‌జాలాన్ని వినిపిస్తూ బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ ల‌ను క‌లుపుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ఆ సమ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల గురించి ప‌వ‌న్ ప్ర‌చారం చేశారు. చంద్ర‌బాబు కుటుంబ రాజ‌కీయం గురించి ప్రస్తావించారు. కానీ, ఆయ‌న రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీకి గుర్తింపు వ‌చ్చే ఓటు బ్యాంకును ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు.

Also Read : Pawan Kalyan: వైసీపీపై పవన్ కల్యాణ్ ఫైర్.. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ జగన్ పై సెటైర్..!

ఆక‌స్మాత్తుగా 2019 ఎన్నిక‌ల త‌రువాత హిందూవాదాన్ని నిల‌బెట్ట‌డానికి బీజేపీ పంచ‌న ప‌వ‌న్ చేరారు. ఆనాటి నుంచి బీజేపీతో పొత్తు ఉంద‌ని ప్ర‌క‌టించారు. పార్టీ విలీనం కోసం ఢిల్లీ పెద్ద‌లు బ‌ల‌వంతం చేస్తున్నార‌ని తొలి రోజుల్లో చెప్పారు. ఆ త‌రువాత బీజేపీ, జ‌న‌సేన క‌లిసి తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. డిపాజిట్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోవ‌డంతో ప‌వ‌న్ స‌త్తా ఏమిటో బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల‌కు అర్థ‌మ‌యింది. ఆనాటి నుంచి పెద్ద‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డంలేదు. దీంతో ఇప్పుడు టీడీపీ వైపు మ‌ళ్లారు. బీజేపీని వ‌దిలేసి, టీడీపీతో జ‌త క‌ట్టాల‌ని చూస్తున్నారు. కానీ, ఢిల్లీ పెద్ద‌ల వ్యూహం మ‌రోలా ఉంది. ఇలాంటి ప‌రిణామాల మ‌ధ్య యువ‌శ‌క్తి ప్రోగ్రామ్ కు శ్రీకాకుళం వేదిక‌గా ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఆ వేదిక‌గా ఆయ‌న మంత్రి రోజా మీద వాడిన ప‌ద‌జాలం సినిమాటిక్ సెటైర్ లా ఉంది. వ్యంగ్యంగా `తూ..నా బ‌తుకు చెడ` అంటూ మంత్రి రోజాను తిట్టేశారు. డైమండ్ రాణి న‌న్ను తిట్టేదైయింద‌ని చుల‌క‌న భావం వ్య‌క్త‌పరిచారు.