Political CID : సీఐడీ దూకుడు, షాతో చంద్ర‌బాబు భేటీ త‌రువాత‌.!

ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు జ‌రిపిన‌ ఏకాంత మీటింగ్ ప‌లు ర‌కాల ఊహాగానాలకు (Political CID ) నాలుగు రోజుల‌కు కూడా వాటికి తెర‌ప‌డ‌డంలేదు

  • Written By:
  • Updated On - June 7, 2023 / 02:54 PM IST

ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు జ‌రిపిన‌ ఏకాంత మీటింగ్ ప‌లు ర‌కాల ఊహాగానాలకు (Political CID ) తావిస్తోంది. ఆయ‌న వెళ్లొచ్చిన నాలుగు రోజుల‌కు కూడా వాటికి తెర‌ప‌డ‌డంలేదు. పొత్తుల కోస‌మా? రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడేందుకా? వ్య‌క్తిగ‌త అంశాల గురించి చ‌ర్చించేందుకా ? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్య‌ర్థులు మాత్రం సొంత ప్ర‌యోజ‌నాల కోసం అంటూ బాహాటంగా చెబుతున్నాయి. కానీ, ఆయ‌నకంటూ(Chandrababu) సొంత ప్ర‌యోజ‌నాలు పెద్ద‌గా ఉండ‌వ‌ని చంద్ర‌బాబు గురించి తెలిసిన వాళ్లు చెబుతుంటారు. రాబోవు ఎన్నిక‌ల్లో పొత్తుల గురించి చ‌ర్చండానికి వెళ్లార‌ని చాలా మంది భావిస్తున్నారు. అందులో నిజ‌మెంత‌? అనేది హాట్ టాపిక్.

ఏపీ సీఐడీ దూకుడును త‌గ్గించుకోవ‌డానికి (Political CID)

రాష్ట్రంలో సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత లా అండ్ ఆర్డ‌ర్ గురించి తొలి నుంచి టీడీపీ(Chandrababu) ఆందోళ‌న చెందుతోంది. సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన వాళ్ల‌ను జైళ్ల‌కు పంపారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడిన డాక్ట‌ర్ సుధాక‌ర్ ఏ విధంగా చ‌నిపోయారు? అనేది కూడా అంద‌రికీ తెలిసిందే. ఇక రీ పోస్ట్ చేసిన 70ఏళ్ల రంగ‌నాయ‌క‌మ్మను ఎలా టార్గెట్ చేశారు? అనేది కూడా చూశాం. ఐఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, కొల్లు ర‌వీంద్ర‌, అయ్య‌న్న‌పాత్రుడు త‌దిత‌రుల అరెస్ట్ లు సంచ‌ల‌న క‌లిగించాయి. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల న‌రేంద్ర‌, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రుల అరెస్ట్ లు టీడీపీ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌రం పుట్టించాయి. తాజాగా మార్గ‌దర్శి, ఫైబ‌ర్ నెట్, చంద్ర‌బాబు హ‌యాంలోని ప‌థ‌కాల్లో అక్ర‌మాలు త‌దిత‌రాల‌పై సీఐడీ స్పీడ్ పెంచింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్ర‌బాబు భేటీ కావ‌డం వ్య‌క్త‌గ‌త అంశాల గురించి అంటూ ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది.

ఎన్డీయే భాగ‌స్వామిగా చేర‌డానికి టీడీపీ సిద్దం

క‌ర్ణాట‌క ఫలితాల త‌రువాత చంద్రబాబు(Chandrababu) అవ‌స‌రం బీజేపీకి ఏర్ప‌డిన మాట వాస్త‌వం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డానికి టీడీపీకి ఉన్న బ‌లం తోడుకావాలి. లేదంటే, ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌లం(BJP) దాదాపుగా శూన్యం. పైగా ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రూ రావ‌డంలేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే, నిశ్శ‌బ్దం క‌మ‌ల‌నాథుల్లో ఉంది. దాన్ని ఛేదించ‌డానికి టీడీపీ పొత్తును (Alliance)ఒక అస్త్రంగా చేసుకోచ‌చ్చ‌ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు భావించి చంద్ర‌బాబుకు అపాయిట్మెంట్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఎన్డీయే భాగ‌స్వామిగా చేర‌డానికి టీడీపీ సిద్దంగా ఉంది. కానీ, బీజేపీలోని ఒక గ్రూప్ టీడీపీని దూరంగా పెట్టాల‌ని కోరుకుంటోంది. ఆ క్ర‌మంలో పొత్తు అంశం గురించి ప్ర‌స్తావించ‌డానికి కాద‌ని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలోని ఇద్ద‌రు కీల‌క లీడ‌ర్లు అమిత్ షా తో అపాయిట్మెంట్ పెట్టించార‌ని టాక్‌. దాని వెనుక రాజ‌కీయ ఎజెండా కంటే తాజాగా జ‌రుగుతోన్న ఏపీ సీఐడీ (Political CID) అంశం గురించి మాట్లాడేందుకు అమిత్ షా తో క‌లిసిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

Also Read : AP CID : వివేక హ‌త్యపై సీబీఐ విచార‌ణ వేళ అమ‌రావ‌తి పై `సీఐడీ` హ‌ల్ చ‌ల్‌

ఇక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి కేంద్రంతో మాట్లాడే ధైర్యాన్ని ఏపీలోని రాజ‌కీయ పార్టీలు ఏవీ చేయ‌లేక‌పోతున్నాయి. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, వెనుక బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజి, 9-10 షెడ్యూల్ ఆస్తుల విభ‌జ‌న త‌దిత‌రాల గురించి మాట్లాడ‌డం ఎప్పుడో మ‌ర‌చిపోయారు. కేంద్రంలోని బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉండేందుకు పార్టీల‌న్నీ పోటీప‌డుతున్నాయి. ఒక‌రిని మించి మ‌రొక‌రు బీజేపీతో లైజ‌నింగ్ కోసం పాకులాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు మాత్రం కాదు. కేవ‌లం రాజకీయ‌, ప్రైవేటు ప్ర‌యోజ‌నాల కోసం మాత్రమే  అనేది బీజేపీలోని ఒక వ‌ర్గం చెబుతోంది. కేవ‌లం ఏపీ సీఐడీ దూకుడును(Political CID) త‌గ్గించుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నంగా ఢిల్లీ చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న వెనుక ఉన్న ఆంత‌ర్యమ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని చ‌ర్చ‌. అంటే, పొత్తు అనే అంశం ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్రాధాన్య‌తా అంశం కాద‌ని తెలుస్తోంది.

Also Read : TDP – BJP Alliance : టీడీపీతో క‌లిస్తే బీజేపీకి లాభ‌మా? ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు.. మోదీ, షా వ్యూహం అదుర్స్‌?