Political Business : `కాపు `కోట‌లో రియ‌ల్ `తోట‌`! ఏపీలో బీఆర్ఎస్ దందా!

తోట చంద్ర‌శేఖ‌ర్ హైద‌రాబాద్ కేంద్రంగా రియ‌ల్ ఎస్టేట్ న‌డిపే బ‌డా వ్యాపారి(Political Bussiness).

  • Written By:
  • Updated On - January 3, 2023 / 08:49 AM IST

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐఏఎస్ అధికారి తోట చంద్ర‌శేఖ‌ర్. కుటుంబ సభ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ కేంద్రంగా రియ‌ల్ ఎస్టేట్ న‌డిపే బ‌డా వ్యాపారి(Political Business). ఒక బుల్లి టీవీ ఛాన‌ల్ ఓన‌ర్ గా పేరుంది. జ‌న‌సేన చీఫ్(Janasena) ప‌వ‌న్ క‌ల్యాణ్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన లీడ‌ర్. ప్ర‌జారాజ్యం త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసి డిపాజిట్లు కూడా పొంద‌లేని లీడ‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌. ప‌దేళ్లుకు పైగా రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌రికీ అందుబాటులో ఉండ‌ర‌ని ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న పోటీచేసి ఓడిపోయిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ మాత్రం ప‌ట్ట‌లేని `తోట‌`ను కేసీఆర్ ఏపీ చీఫ్ గా ఎంపిక చేసుకోవ‌డం వెనుక లాజిక్ లేక‌పోలేదు.

బ‌డా రియ‌ల్డ‌ర్ గా సామాజిక‌వ‌ర్గంలో గుర్తింపు(Political Business)

వేల కోట్ల రూపాయాల లావాదేవీల‌ను హైద‌రాబాద్ లో తోట చంద్ర‌శేఖ‌ర్ (Political Business)జ‌రుపుతుంటారు. బ‌డా రియ‌ల్డ‌ర్ గా ఆయ‌న సామాజిక‌వ‌ర్గంలో గుర్తింపు ఉంది. జ‌న‌సేన(Janasena) పార్టీకి బాకా ఊద‌డానికి ఒక ఛాన‌ల్ పెట్టుకుని ఇప్ప‌టి వ‌ర‌కు `మెగా` కుటుంబం మెప్పు పొందుతూ వ‌చ్చారు. ఈసారి ఆయ‌న‌కు జ‌న‌సేన టిక్కెట్ ఇచ్చే ప‌రిస్థితుల్లో లేదు. పైగా టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖ‌రారు అవుతుంద‌ని టాక్ ఉన్న క్ర‌మంలో ఆయ‌న ప్ర‌త్యామ్నాయాల వైపు చూశారు. కానీ, ఏ పార్టీ ఆయ‌న‌కు నీడ‌ను ఇవ్వ‌లేద‌ని రాజ‌కీయ స‌ర్కిల్స్ లో ఉన్న అభిప్రాయం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న చంద్ర‌శేఖర్ ను శుభ‌ముహూర్తాన బీఆర్ ఎస్ లోకి తీసుకోవ‌డం కేసీఆర్ వ్యూహాల్లోని హైలెట్ పాయింట్‌.

Also Read : BRS Operation: బీ ఆర్ ఎస్ ఏపీ చీఫ్ తోట, కేసీఆర్ ఫస్ట్ ఆపరేషన్ ,JSPకి షాక్

జనసేనలో అధినేత పవన్ కు కుడిభుజంగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప‌నిచేశార‌ని సొంత ఛాన‌ల్ ద్వారా బాకా ఊదించారు. కొంత కాలంగా జనసేన వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఐటి కంపెనీ అధినేతగా, ఒక బుల్లి మీడియా సంస్థ అధిపతిగా ఉన్న తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి వెళ్ల‌డం వెనుక కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇక జ‌న‌సేన బ్రాండ్ గా రాజ‌కీయాల్లో ఎదిగిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్ఎస్ చేరటం అనివార్యం అయింది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రావెల టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీ చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్దసారధి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల్లో

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధం ఉంది. వాళ్లిద్ద‌రూ ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు రాజ‌కీయ‌, విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోర‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల్లో ఉన్న విశ్వాసం. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో న‌డిచే రాజ‌కీయాల‌కు వాళ్లిద్దర్నీ కేంద్ర బిందువులుగా చూడొచ్చు. బ‌హుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే జ‌న‌సేన మీద ఆప‌రేష‌న్ ప్రారంభమైంద‌ని బోధ‌ప‌డుతోంది. సామాజిక‌వ‌ర్గం బ‌లంతో రాజ‌కీయాల‌ను ర‌క్తిక‌ట్టిస్తోన్న ప‌వ‌న్ కు తోట చంద్ర‌శేఖ‌ర్ రూపంలో కత్తెర వేయ‌డానికి కేసీఆర్ రూపంలో ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ ఎత్తుగ‌డ‌ల్లో భాగ‌మంటూ జ‌న‌సేన భావిస్తోంది.

ఏపీలోని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నుంచి కాపు నేత‌లు చాలా మంది కేసీఆర్ కు ట‌చ్ లో ఉన్నారు. వాళ్లంద‌రూ విడ‌త‌లవారీగా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డానికి సిద్ధం అవుతున్నారు. ఫ‌లితంగా దాదాపు జ‌న‌సేన ఖాళీ కానుంద‌ని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు కొన‌సాగుతోంది. ఇప్పుడిప్పుడే ఫోక‌స్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోన్న జ‌న‌సేన‌కు `కాపు` అండ కీల‌కం. ఆ సామాజిక‌వ‌ర్గాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. దీంతో జ‌న‌సేన భ‌విష్య‌త్ ఏమిటి? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.

Also Read : Janasena : ప‌వన్ పై `వారాహి`! రంగుపై జ‌గ‌న‌న్న `సైన్యం`!!