Political Alliance : ఎవ‌రి మాట నిజం, పొత్తు పొడుపుల్లో..!

రాజకీయ స‌మీక‌ర‌ణాల‌ను(Political Alliance) ఒక్కొక్క‌రు ఒక్కోలా అన్వ‌యించుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 02:54 PM IST

రాజకీయ స‌మీక‌ర‌ణాల‌ను(Political Alliance) ఒక్కొక్క‌రు ఒక్కోలా అన్వ‌యించుకుంటున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు(Vote equation) చీల‌కుండా చూస్తాన‌ని ప‌వ‌న్ అంటున్నారు. టీడీపీ, జ‌న‌సేన‌, సీపీఐ క‌లిసి పోటీ చేస్తాయ‌ని క‌మ్మూనిస్ట్ లీడ‌ర్ నారాయ‌ణ చెబుతున్నారు. అండ‌మాన్ కేంద్రం బీజేపీ, టీడీపీ పొత్తు విజ‌యం సాధించిన విష‌యాన్ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా గుర్తు చేస్తున్నారు. టీడీపీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద జ‌రిగిన 41వ ఆవిర్భావ స‌భ వ‌ద్ద త‌ళుక్కున మెరిశారు. ఎన్డీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌త్యేక నాణెం విడుద‌ల చేసింది. అందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ మోడీకి చంద్ర‌బాబు లేఖ రాయ‌డం జ‌రిగింది. ఇవ‌న్నీ చూస్తుంటే, ఏపీలో రాజ‌కీయ ఈక్వేష‌న్లు ఎలా ఉండ‌బోతున్నాయి? అనేది హాట్ టాపిక్ అయింది.

రాజకీయ స‌మీక‌ర‌ణాల‌ను ఒక్కొక్క‌రు ఒక్కోలా(Political Alliance)

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, సీపీఐ నేత నారాయ‌ణ‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి చ‌ర్చ వాళ్లిద్ద‌రి మ‌ధ్యా జ‌ర‌గ‌కుండా టీడీపీ, జన‌సేన‌, సీపీఐ పొత్తు (Political Alliance)గురించి మాట్లాడే ఛాన్స్ త‌క్కువ‌. అంటే, ఆ మూడు పార్టీలు క‌లిసి పొత్తుకు వెళితే, బీజేపీ దూరంగా ఉంటుంది. క‌మ్యూనిస్ట్ లు ఎప్పుడూ బీజేపీ రాజ‌కీయ వేదిక‌ను పంచుకోలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీకి కామ్రేడ్లు చాలా దూరం. అంతే దూరం బీజేపీ కూడా ఉంటుంది. ఇక ప‌వ‌న్ చేసే ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు చీలిక అనే అంశాన్ని తీసుకుంటే, బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఖాయం కానుంది. అందుకు తగిన విధంగా ఇటీవ‌ల జ‌రిగిన‌ ప‌రిణామాలు ఉన్నాయి. రాష్ట్ర ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఆజాదీకా అమృత మ‌హోత్స‌వ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, మోడీ ఆరేళ్ల త‌రువాత చేతులు క‌లిపారు. అలాగే, జీ 20 దేశాల స‌ద‌స్సులో ప్ర‌తిపాద‌న‌ల కోసం చంద్ర‌బాబును కేంద్రం ఆహ్వానించింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ త‌గ్గించిన భ‌ద్ర‌త‌ను చంద్ర‌బాబుకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా అండ‌మాన్ లో టీడీపీ, బీజేపీ కూట‌మి గెలిచి మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఆ సంద‌ర్భంగా టీడీపీ అభ్య‌ర్థికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా శుభాకాంక్ష‌లు తెలుపుతూ (Vote equation) ట్వీట్ చేశారు. ఇవ‌న్నీ ఆ మూడు పార్టీల పొత్తుకు సంకేతాలుగా ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవంలో న‌డ్డా

లేటెస్ట్ గా తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవంలో న‌డ్డా మెరిశారు. పార్లమెంటులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని, కనకమేడల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా టీడీపీ నేతలో కలిశారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడకు చేరుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాజ్ పేయి హయాంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని నడ్డాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. టీడీపీతో బీజేపీకి ఉన్న సంబంధాలు తనకు తెలుసని చెప్పారు. ఈ పరిణామాల‌న్నీ బీజేపీ, టీడీపీ పొత్తుకు(Political Alliance) క‌నిపిస్తోన్న బ‌ల‌మైన సంకేతాలు.

కేసీఆర్  చురుగ్గా ఉన్న క్ర‌మంలో చంద్ర‌బాబుతో చెక్

వాస్తవంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద‌గా బ‌లంగా లేదు. రాజ్యాధికారం దిశ‌గా తెలంగాణ‌లో అడుగులు వేస్తున్న‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితంలేదు. అందుకే, అమిత్ షా కూడా ప‌లుమార్లు తెలంగాణ ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నారు. ఒక‌టి రెండు సంద‌ర్బాల్లో ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్ప‌టికీ చేరిక‌ల గురించి ప్ర‌స్తావించి వెళ్లారు. కానీ, లాభంలేద‌ని తెలుసుకున్న బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు క్ర‌మంగా టీడీపీ వైపు చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ‌లో రాజ్యాధికారం కోసం టీడీపీతో కూట‌మి అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంది. అందుకే, బుధ‌వారం ఢిల్లీలో జ‌రిగిన టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల్లో క‌నిపించార‌ని తెలుస్తోంది. ఇక ఏపీలో బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. క‌నీసం ఉనికిని కాపాడుకోవ‌డం కూడా ఆ పార్టీకి క‌ష్టం. ఇలాంటి ప‌రిస్థితుల్లో అక్క‌డ కూడా టీడీపీ అవ‌స‌రం(Vote equation) బీజేపీకి ఉంది. జాతీయ రాజ‌కీయాల దృష్ట్యా కూడా చంద్ర‌బాబు అవ‌సరం బీజేపీకి లేక‌పోలేదు. ఒక వైపు కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్న క్ర‌మంలో ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో చెక్ పెట్టాల‌ని బీజేపీ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి అవ‌కాశం ఉంది. అంతేకాదు, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు అవ‌స‌రం. ఇలాంటి ప‌రిణామాలు బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మి కట్టే అవ‌కాశం మెండుగా ఉంది.

Also Read : TTDP Alliance : ప్ర‌జా కూటమి దిశ‌గా టీటీడీపీ, కాసానితో `తీన్మార్` మ‌ల్ల‌న్న స్కెచ్!

చంద్ర‌బాబు సేవ‌ల‌ను జాతీయ స్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంది. అందుకే, జూలు విదిల్చాల‌ని చంద్ర‌బాబును మాజీ ఎంపీ కేవీపీ కోరారు. అన‌ర్హ‌త వేటు రాహుల్ మీద ప‌డిన త‌రువాత దేశ వ్యాప్తంగా విప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో కాంగ్రెస్ ఉంది. అందులో భాగంగా జాతీయ రాజ‌కీయాల‌పై (Political Alliance)సంపూర్ణ అవ‌గాహ‌న ఉన్న చంద్ర‌బాబు స‌హాయ స‌హ‌కారాలు తీసుకోవాల‌ని కాంగ్రెస్ ముందుడ‌గు వేసింది. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీ అభివృద్ధి మిన‌హా మ‌రో ఆలోచ‌న చంద్ర‌బాబుకు లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న సీనియార్టీ, అనుభ‌వాన్ని ద‌గ్గ‌ర నుంచి చూసిన కాంగ్రెస్ మాత్రం చంద్ర‌బాబు సేవ‌ల‌ను కోరుకుంటోంది. ఒక వేళ బీజేపీ పొత్తుకు ముందుకు రాక‌పోతే చివ‌రి నిమిషంలో కాంగ్రెస్, ఉభ‌య కమ్యూనిస్ట్ లు, టీడీపీ కూట‌మిగా రెండు రాష్ట్రాల్లోనూ ముందుకు వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదని తాజాగా కేవీపీ చేసిన వ్యాఖ్య‌ల ఆధారంగా అర్థ‌మ‌వుతోంది. ఎవ‌రికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుతున్న క్ర‌మంలో పొత్తులపై స్ప‌ష్ట‌త (Vote equation)రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : Alliance : టీడీపీ పొత్తుకు బండి నో ! బీజేపీలో చేరిక‌లకు బ్రేక్! బాబుతో బీఆర్ఎస్?