Site icon HashtagU Telugu

Fake Notes: శ్రీకాకుళంలో 2 వేల నకిలీ నోట్లను పట్టుకున్న పోలీసులు

Fake Notes

New Web Story Copy 2023 08 30t190613.545

Fake Notes: రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో మోసాలు యధేచ్చగా పెరిగిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి పేరుతో పలు ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి ముఠా గుట్టును శ్రీకాకుళం జిల్లా పోలీసులు రట్టు చేశారు.

జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 55 లక్షల రూపాయల విలువైన 2000 రూపాయల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి నకిలీ నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని మండలానికి చెందిన దుంగ వీరమణికంఠ అనే వ్యక్తిని ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 37 లక్షల రూపాయల 2 వేల దొంగనోట్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో 17 లక్షల 98 వేల రూపాయల 2 వేల రూపాయలు పట్టుకున్నారు.

నిందితులు కర్ణాటక నుంచి ఈ నకిలీ నోట్లను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి నిందితుల పట్ల ప్రజలు అత్యాశకు గురై మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి నిందితులు ఎక్కడైనా కనిపిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని లేదా 100కు డయల్ చేయాలని కోరారు.ఇదిలా ఉండగా ఈ నకిలీ నోట్ల కేసులు రోజురోజుకు బయటపడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో పలు నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే దోషులను అరెస్టు చేసి శిక్షించినా ఇలాంటి మోసాలు ఆగడం లేదు. ఎక్కడో వెలుగు కనిపిస్తూనే ఉంది. అయితే నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Britain: చిలుకను చంపివేసినందుకు 25 నెలలు జైలు శిక్ష