Site icon HashtagU Telugu

Chandrababu Arrest: చంద్రబాబు కోసం పవన్ .. అనుమతి నిరాకరణ

Chandrababu Arrest

New Web Story Copy 2023 09 09t174611.600

Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్ట్ అయ్యారు. నిన్న నంద్యాలలో ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కింద బాబుని అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ అధికారులు నిర్దారించారు. ఈ రోజు ఆయనను సిట్ ముందు హాజరుపరిచేందుకు కార్యాలయానికి తీసుకెళ్తుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను సీఐడీ అధికారులు కలిసేందుకు అనుమతి నిరాకరించారు. ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు మినహా ఎవరికీ అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పవన్ వెనుదిరిగారు. ఇదిలా ఉండగా చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. టీడీపీ మద్దతురాలు చంద్రబాబు అరెస్టుని అడ్డుకునేందుకు ఆయనను తీసుకెళ్తున్న కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. దీంతో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ లీడర్లు, మద్దతు పార్టీలు సీఎం జగన్ తీరుని తప్పుబడుతున్నారు. తీవ్రస్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు. అటు, తెలంగాణలోనూ టీడీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మలను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి.

Also read: AP Governor Abdul Nazeer : చంద్రబాబు అరెస్ట్ ఫై గవర్నర్ నజీర్ ఆశ్చర్యం