టీడీపీ కేంద్ర కార్యాలయం (Attack on TDP office)పై జరిగిన దాడి కేసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy
)కి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు (Notice) జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసు (DSP Office)కు చేరుకున్నారు సజ్జల. సజ్జలతో పాటు విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని.. సజ్జలతో పాటు విచారణకు అనుమతించలేమని స్పష్టం చేశారు.
ఇక విచారణలో ఫోన్ అడిగినా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వలేదని మంగళగిరి గ్రామీణ పీఎస్ సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం ఆయనను 38 ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. వీటిలో కొన్నింటికి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. మరి కొన్ని విషయాలు గుర్తులేదని, కొన్నింటితో అసలు సంబంధం లేదని చెప్పారని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతోనే సజ్జలను ప్రశ్నించినట్లు తెలిపారు.
ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19న వైసీపీ పార్టీకి చెందిన కొందరు నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసారు. వైసీపీ కీలక నేతలు దేవినేని అవినాష్,లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించడంతో పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి..ఈరోజు విచారించారు.
Read Also : Junior Lineman Jobs : విద్యుత్ శాఖలో 3500 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్