Police Power : ప‌వ‌న్ కు ఏపీ పోలీస్ నోటీసులు? హ‌త్యకు కుట్ర‌పై సీరియ‌స్

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ఏపీ పోలీస్ (Police power) క‌న్నేసింది. ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌యింది.

  • Written By:
  • Updated On - June 20, 2023 / 03:27 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ఏపీ పోలీస్ (Police power) క‌న్నేసింది. ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌యింది. ఆ దిశ‌గా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. హ‌త్య‌కు కుట్ర అంటూ భావోద్వేగాల‌ను ప‌వ‌న్ (Pawan) రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఎవ‌రైనా హ‌త్య చేయాల‌ని సుఫారీ ఇస్తే, దానికి సంబంధించిన ఆధారాల‌ను చూపాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఆ మేర‌కు పోలీసుల‌కు కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం డైరెక్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ఏపీ పోలీస్ (Police power)

ఇటీవ‌ల గ్రూప్ పేప‌ర్ లీకులు సంద‌ర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంలోని కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆ సంద‌ర్భంగా ఆధారాల‌ను చూపాల‌ని తెలంగాణ పోలీసు సీఐడీ నోటీసులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. అదే త‌ర‌హాలో హ‌త్య కుట్ర‌కు సంబంధించిన ఆధారాల‌ను చూపాల‌ని ప‌వ‌న్ కు నోటీసులు జారీ చేయ‌డానికి ఏపీ పోలీసులు (Police Power) రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. రేపోమాపో ఆయ‌నకు నోటీసులు అంద‌నున్నాయి. లేదంటే సుమోటోగా కేసును రిజిస్ట్ర‌ర్ చేయాల‌ని భావిస్తున్నారు.

గ‌త ఏడాది వంగ‌వీటి రాధా కూడా హ‌త్య‌కు కుట్ర

గ‌త ఏడాది వంగ‌వీటి రాధా కూడా హ‌త్య‌కు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఇంటి వ‌ద్ద రెక్కీ కూడా నిర్వ‌హించార‌ని అనుమానించారు. వాళ్లు ఎవ‌రో కూడా తెలుసంటూ మీడియాకు వెల్లడించారు. ఆ సంద‌ర్భంగా పోలీసులు సుమోటోగా కేసు క‌ట్టారు. ఆయ‌న ఫిర్యాదు చేయ‌న‌ప్ప‌టికీ పోలీసులు రాధా వ‌ద్ద స‌మాచారం తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌రువాత అదంతా తూచ్ అంటూ పోలీసులు (Police Power)తేల్చేశారు. అప్ప‌టి వ‌ర‌కు అటు వైసీపీ ఇటు టీడీపీ ప‌ర‌స్ప‌రం చేసుకున్న ఆరోప‌ణ‌లు ఒక ర‌క‌మైన టెన్ష‌న్ వాతావ‌ర‌ణాన్ని సృష్టించాయి.

రాజ‌కీయాల్లోకి రాక‌మునుపే మెగా కుటుంబాన్ని మ‌ట్టు పెట్టాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నం

ప‌ది రోజుల పాటు ఎన్నిక‌ల ప్ర‌చారానికి దిగిన ప‌వ‌న్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న అధికార ప‌క్షం లీడ‌ర్ల మీద వాడుతున్న ప‌ద‌జాలం దారుణంగా ఉంది. సినిమాటిక్ డైలాగులు వేస్తూ ప్ర‌చారాన్ని ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, ఆయ‌న వాడుతోన్న ప‌ద‌జాలం మాత్రం సగ‌టు ఆంధ్రుడు రాజకీయాల‌ను అస‌హ్యించుకునేలా ఉంది. న‌డి వీధిలో త‌న్నుకుంటూ వెళ‌తా, బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా, కొడ‌క‌ల్లారా..అంటూ నోరుపారేసుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో విధంగా మాట్లాడుతోన్న ప‌వ‌న్ ప్ర‌చారాన్ని మ‌రింత ర‌క్తిక‌ట్టించడానికి హ‌త్య‌కు కుట్ర అంటూ మొద‌లు పెట్టారు. స‌రిగ్గా ఇక్క‌డే ఏపీ పోలీసులు(Police Power) అప్ర‌మ‌త్తం అయ్యారు.

Also Read : Pawan CM slogan : ప‌వ‌న్ సీఎం లెక్క‌తో ఏపీ రాజ‌కీయాల్లో తిక్క.!

రాజ‌కీయాల్లోకి రాక‌మునుపే మెగా కుటుంబాన్ని మ‌ట్టు పెట్టాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నం చేశార‌ని తీవ్ర ఆరోప‌ణ ప‌వన్ చేశారు. అంతేకాదు, ప్రాణ‌హాని ఉంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. హ‌త్య‌కు సుఫారీ కుదుర్చుకున్నార‌ని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాల‌ను చూడాల్సిన బాధ్య‌త ప‌వ‌న్ పై ఉంది. లేదంటే, పోలీసులు(Police Power) చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావించ‌డంలో త‌ప్పులేదు. స‌మాజంలో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తే సీఆర్ పీసీ ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాలి. హ‌త్య కుట్ర‌కు సంబంధించిన ఆధారాల‌ను చూపితే, విచార‌ణ చేప‌ట్టాలి. నిజాల‌ను నిగ్గు తేల్చాలి. లేదంటే పోలీసులు ప‌రువుతో పాటు స‌మాజంలో అనిశ్చితి నెల‌కొనే ప్ర‌మాదం ఉంది.

Also Reada: Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?