Site icon HashtagU Telugu

Jogi Ramesh : జోగికి మరో షాక్..అరెస్ట్ తప్పదా..?

Shock To Jogi

Shock To Jogi

జోగి రమేష్ (Jogi Ramesh) కు మరో షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ కేసులో ఉదయం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు నిర్వహించి..ఆయన కుమారుడు రాజీవ్ (Jogi Rajeev) ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని , ఇద్దరిని ఈరోజు అరెస్టు చేశామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలుపడం జరిగింది. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ను మార్చారని, సీఐడీ అటాచ్‌మెంట్లో ఉన్నాయని , తమ విచారణలో పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని , ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని సౌమ్యలత తెలిపింది. జోగి రమేశ్ పాత్రపై విచారణ జరుగుతోందని, నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అరెస్ట్ అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ..కుట్ర పూరితంగా టీడీపీ సర్కార్ అరెస్ట్ చేసారని ప్రభుత్వం ఫై కీలక విమర్శలు చేసారు. ఇదిలా ఉండగా..మరో కేసులో జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల నేపథ్యంలో జోగి రమేశ్ విచారణకు వెళ్లనున్నారు. దీంతో ఒకే సారి రమేష్ కు రెండు షాకులు తగిలినట్లు అయ్యింది. మొత్తం మీద వైసీపీ నేతలకు కూటమి సర్కార్ నిద్ర పోనివ్వడం లేదని అర్ధం అవుతుంది.

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు ఏ రేంజ్‌లో చెలరేగిపోయారో తెలియంది కాదు. వయస్సు, రాజకీయ అనుభవాన్ని కూడా గౌరవించకుండా చంద్రబాబుపై ఏకవచనంతో బూతుల దండకాలు వల్లించారు. ఎప్పటికీ అధికారం తమదే అన్న ధీమాతో ఎక్కడ పడితే అక్కడ టీడీపీ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం..ఆ నేతలపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లలో పోలీసుల చేత కొట్టించడం ఇలా ఎన్నో చేసారు. కట్ చేస్తే.. ఇప్పుడు అందరి ముఖచిత్రాలు మారిపోయాయి. 175 కి 175 గెలుస్తున్నాం అన్న నేతలంతా ఓటమి పాలై అడ్రెస్ లేకుండా పోయారు. కేవలం 11 స్థానాలకు పరిమితమై..ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఇదే క్రమంలో కూటమి సర్కార్ సైతం ఎవరైతే అధికార మదంతో రెచ్చిపోయారో..వారికి వరుస షాకులు ఇవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తూ.. ఎవరికీ కనపడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జోగి వంతు వచ్చింది.

Read Also : Tragedy : బీహార్‌లో ఘోరం.. మహిళా కానిస్టేబుల్‌ సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి