ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ (Posani Krishna Murali Arrest) చేసిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని తన నివాసంలో ఓబులవారిపల్లె పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు రాగానే పోసాని వారితో వాగ్వాదానికి దిగారు. తన ఆరోగ్యం సరిగాలేదని, ముందుగా వైద్యం చేయించుకోవాలని చెప్పినప్పటికీ, పోలీసులు చట్టపరంగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిందేనని స్పష్టంగా తెలిపారు. చివరికి నోటీసులు ఇచ్చి, ఆయనను అదుపులోకి తీసుకుని తరలించారు.
Trump-Putin : ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ ఆమోదం
ప్రస్తుతం కడప జిల్లాలోని రహస్య ప్రదేశంలో పోసాని కృష్ణమురళిపై విచారణ జరుగుతోందని సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. అక్కడ విచారణ పూర్తైన తర్వాత, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో పోసాని ఏపీ ఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు కొన్ని రాజకీయ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
Janasena : ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు
ఇటీవల జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి, పోసానిపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పోసానిపై విచారణ మరింత తీవ్రతరం అయింది.