Site icon HashtagU Telugu

Nara Lokesh Convoy : నారా లోకేష్ కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు..

Police Inspecting Nara Loke

Police Inspecting Nara Loke

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా (Elections) మోగింది. ఈ క్రమంలో ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో సీఈసీ (CEC) ఆదేశాలతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. రూ.లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని సీఈసీ తెలిపింది. రూ. 10 లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించుకోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీ విషయానికి మే 13 న పోలింగ్ జరగనుండగా..జూన్ 04 ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. దీంతో అని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రావడంతో విధుల్లోకి దిగిన పోలీసులు ఉండవల్లి కరకట్ట సమీపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ (Nara Lokesh Convoy)ను ఆపి తనిఖీలు నిర్వహించారు. తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న లోకేష్ కాన్వాయ్‌లోని అన్ని కార్లను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే తనిఖీ చేస్తున్నట్టు లోకేశ్‌కు పోలీసులు తెలిపారు. దీంతో లోకేశ్ వారికి సహకరించారు. మొత్తం అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులకు వాహనాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులు లేకపోవడంతో కాన్వాయ్‌ని వదిలిపెట్టారు.

Read Also : CPI Narayana Injured : హాస్పటల్ లో చేరిన సీపీఐ నేత నారాయణ