ఏపీలో రాజకీయ ప్రతిపక్ష నేతలపై పోలీసుల చర్యలు తాజాగా మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులపై వరుసగా కేసులు నమోదు అవుతుండడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజా చర్చకు కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu). గడచిన నెల 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా అంబటి కొన్ని నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అంబటికి నోటీసులు (Police Notice) జారీ చేసిన పోలీసులు, ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పోలీసులు ఇచ్చిన ప్రకారం.. సంఘటన జరిగిన సమయంలో అక్రమ రీతిలో సభ నిర్వహించడం, పోలీసుల అనుమతి లేకుండా జన సమూహాన్ని సమీకరించడం వంటి అంశాలపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. దీంతో అంబటి రాంబాబు ఈ నెల 21న విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.
IT Refund: ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ హెచ్చరికలు..పొరపాటున కూడా ఆ మెసేజ్ లను నమ్మకండి
ఇది ఒక్కటే కాకుండా, గతంలో కూడా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అంబటిపై మరో కేసు నమోదైందని సమాచారం. తాజాగా ఫైల్ అయిన కేసులో కూడా మాజీ మంత్రి విడదల రజనీ, ఇతర వైసీపీ నేతలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు. మొత్తం 118 మందిపై కేసులు నమోదు చేయడం గమనార్హం. ఇప్పటికే ఇందులో చాలా మందిని పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పెరుగుతున్న అరెస్టులు, నోటీసులు, కేసులు ఎలాంటి రాజకీయ సంకేతాలు ఇస్తున్నాయనే చర్చ కూడా కొనసాగుతోంది. వైసీపీ నేతలపై తూర్పు జిల్లాల నుండి పశ్చిమ వరకు ఇలాంటి కేసులు నమోదు కావడం వల్ల ఇది కేవలం లీగల్ ప్రక్రియ మాత్రమేనా? లేక రాజకీయ రీతిలో ఎత్తుగడా? అన్నదానిపై నేతలూ, విశ్లేషకులూ చర్చ మొదలుపెట్టారు.