Chalo Vijayawada: ‘చలో విజయవాడ’లో కోవర్ట్ లు

ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య 'చలో విజయవాడ' కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 07:06 PM IST

ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ‘చలో విజయవాడ’ కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం ప్రభుత్వం జమ చేసింది. కనీసం ఐదు నుంచి 20 వేల వరకు జీతాలు పెరిగాయని ఖాతాలు చూసుకున్న వాళ్లకు అర్థం అయింది. దీంతో చాలా మంది స్వచ్చందంగా చలో విజయవాడ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కొందరు విపక్షాల మద్దతుతో ఉద్యమానికి సిద్దం అవుతున్నారని పోలీస్ అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం పీఆర్సీ ఇష్యూ కోర్టులో ఉంది. దానిపై వాదనలు జరుగుతున్నాయి. పీఆర్సీ అంటే జీతాలు పెంచడం కాదని తొలి రోజు వాదనలు సందర్భంగా కోర్ట్ వాఖ్యానించింది. కొత్త పీఆర్సీ కారణంగా జీతాలు తగ్గినట్టు చూపగలరా? అంటూ రెండో విడత విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఇంకా వాదనలు జరగడానికి అవకాశం ఇస్తూ కేసును వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చలో విజయవాడ కార్యక్రమం కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుంది. ఆ మేరకు ఉద్యమానికి బయటికి వచ్చే వాళ్లపై కేసులు నమోదు చేయడానికి పోలీస్ రెడి అయింది. ఇక ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. వాటిని డిక్కరిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద ఎలాంటి కేసులు పెట్టారో..అవే ఏపీ ఉద్యోగులపై పెట్టె ఛాన్స్ ఉంది. అన్ని రకాలుగా ఏపీ పోలీస్ జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి పరిణామాలు మధ్య దాదాపుగా చలో విజయవాడ ప్రభావం ఉండే అవకాశం లేదు.
అయితే, ఏపీలో పీఆర్సీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం జరగనున్న ‘పీఆర్సీ సాధన సమితి’ ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపు కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు విజయవాడకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.వివిద జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలకు విజయవాడ వెళ్లవద్దని నోటీసులు జారీ చేస్తున్నారు. ఆదేశాలు ఉల్లంఘించి కొన్ని ప్రాంతాల్లో గృహనిర్బంధాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
మరోవైపు యూనియన్ నేతల ఇంటి చిరునామాలను పోలీసులు సేకరిస్తున్నారు. విజయవాడకు వచ్చే వారి వివరాలను సేకరించాలని వాలంటీర్లకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీ సాదన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ సేవలను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. వేతన స్లిప్పులతో పాటు పీఆర్సీ జీఓలను తగులబెట్టాలని సంఘాలకు పిలుపునిచ్చారు.
చలో విజయవాడ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ఎన్జీవో అధ్యక్షుడు నరసింహులును పోలీసులు గృహనిర్భందం చేశారు. – హిందూపూర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని అతని ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసు జారీ చేశారు. విజయవాడ వెళ్తున్న ప్రకాశం జిల్లా యూనియన్ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఒంగోలులోని ఓ స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు శరత్‌ను గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు, వాకాడు, వరికుంటపాడులో ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయగా, ఆత్మకూరులో మరికొంత మంది ఉపాధ్యాయులను గృహనిర్బంధంలో ఉంచారు. పీఆర్సీ సాధన సమితి నాయకుడు సుధాకర్ రావును నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితిని పూర్తిగా పోలీస్ కంట్రోల్ లోకి తీసుకుంది. విపక్షాలపై కూడా నిఘా పెట్టింది. వార్డ్, గ్రామ సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడ కు దూరం అయ్యారు. ఆర్టీసి సంఘాలు కూడా పునరాలోచనలో పడ్డాయని తెలుస్తుంది. ఉద్యోగ సంఘాలు వ్యవహారాన్ని నమ్మలేకపొతున్నారు. కార్మికులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని సమాచారం. రాత్రికి రాత్రి మొత్తం చలో విజయవాడ పోరాటం చల్లబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పంచన చేరారని తెలుస్తుంది. ఫలితంగా చలో విజయవాడ భగ్నం కావడానికి అవసరం ఉంది.