Site icon HashtagU Telugu

AP Secretariat : కీలక ఫైల్స్ మిస్ కావొచ్చు అనే అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీస్ బందోబస్తు

Police Cheking

Police Cheking

ప్రభుత్వం మారిందంటే చాలు పలు శాఖల్లో కీలక ఫైల్స్ , డేటా మిస్ అవుతుంటాయి. ఆ మధ్య తెలంగాణ లో కూడా ఇదే జరిగింది. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్..పలు ఫైల్స్ ను మాయం చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా ఇదే తరహాలో కీలక ఫైల్స్ , డేటా మిస్ అయ్యే అవకాశం ఉందని అనుమానంతో ఏపీ సచివాలయంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఐటీ కమ్యునికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్ లు, ల్యాప్ ట్యాప్ లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేసారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ ల నుంచి డేటా తస్కరణకు, చేరిపివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో అధికారుల తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, డేటా హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వర్​లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడం తో తనిఖీలు చేసారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇక ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం సాధించింది. కూటమి 164 స్థానాలు సాధించగా , వైసీపీ కేవలం 11 కే పరిమితం అయ్యింది. ఇక ఈ విజయం తో కూటమి నేతలు , శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : NDA Alliance Meet: ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్