Site icon HashtagU Telugu

Tirupati : తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టు ర‌ట్టుచేసిన పోలీసులు

red sandal

red sandal

తిరుపతి జిల్లా పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ దీని విలువ రూ.4.31 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేశారు. మొత్తం 275 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద ఎర్రచందనం స్వాధీనం అని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో చెన్నైకి చెందిన ఎం మురుగన్ (42), హేమంత్ కుమార్ (37), ఎస్ రవి (31), ఆర్ విమల్ (32), జి సురేందర్ (33) ఉన్నారు. సోమవారం సూళ్లూరుపేట సర్కిల్‌, తడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎన్‌హెచ్‌-16తో పాటు ఏపీ-టీఎన్‌ సరిహద్దులోని పెద్ద పన్నంగాడు చెక్‌పోస్టు వద్ద వీరిని పట్టుకున్నారు. నాయుడుపేట ఎస్‌డిపిఓ రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అరెస్టు చేసినట్లు ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం 8 గంటలకు అధికారులు చెక్ పోస్ట్ గుండా వేగంగా వస్తున్న రెండు వాహనాలను గమనించారు. వారు వాటిని అడ్డుకుని త‌నిఖీ చేయ‌గా ఎర్ర‌చంద‌నం దుంగ‌లు బ‌య‌ట‌ప‌డ్డ‌డాయి. దీంతో ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 275 ఎర్రచందనం దుంగలు, 5,388 కిలోల చెక్క ముక్కలు, రూ. 4,31,07,200 విలువ చేసే పొడిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, రూ.3,200 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా తిరుపతి ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను సేకరించి తమిళనాడులోని గోడౌన్లలో భద్రపరుస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో మొదటి నిందితుడు మురుగన్‌పై 17 ఎర్రచందనం కేసులు నమోదు కాగా, ఏ2 హేమంత్ కుమార్‌పై మూడు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్ పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించి గత జూన్‌లో విడుదలయ్యాడని, నిందితులందరికీ పీడీ యాక్ట్ వర్తింపజేస్తామని ఎస్పీ తెలిపారు.

Also Read:  Azharuddin : హెచ్‌సీఏ కేసులో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్య‌ర్థి అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్