Site icon HashtagU Telugu

AP journalists Arrest: మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణ, ఇతర జర్నలిస్టులు అరెస్ట్

Crime

Crime

సీనియర్ జర్నలిస్టు అంకబాబు(73) అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేస్తున్న మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణతో పాటు ఇతర జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టులు పోలీసులపై వ్యాఖ్యలు చేయగా, అరెస్టు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై పోరాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జర్నలిస్టులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్‌లు ఫార్వార్డ్ చేశారంటూ సీనియర్ జర్నలిస్టు అంకంబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు 73 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు గురువారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. తామిద్దరమే ఇంట్లో ఉన్న సమయంలో సీఐడీ పోలీసులు వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లినట్లు అంకబాబు భార్య చెప్పారు. అంకబాబు ఈనాడు, ఉదయం దినపత్రికలలో జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పని చేశారు. అంకబాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ విచారిస్తున్నారు. ఆయన భార్యకు నోటీస్ ఇచ్చినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. కాగా, అంకబాబు అరెస్టును వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతలు చావా రవి, కొండా రాజేశ్వరరావు,నిమ్మరాజు చలపతిరావు,ఆర్. వసంత్ తదితరులు ఖండించారు.

Exit mobile version