Site icon HashtagU Telugu

RGV : వర్మ పై పోలీసుల సీరియస్!

Police Notice Rgv

Police Notice Rgv

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopalvarma) పై పోలీసులు(AP Police) సీరియస్ గా ఉన్నారు. గత వారం రోజులుగా ఆయనకోసం గాలింపు చేస్తుంటే..ఆయన మాత్రం హ్యాపీగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం పై సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఈ అయితే ఏడాది క్రితం తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదులు చేశారని… దీనిపై కేసులు నమోదైన విషయాన్ని వర్మ చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసులపై ఏపీ హైకోర్టు లో వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

ఎక్స్ లో తాను చేసిన పోస్టులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారని.. ఈ పోస్టులపై కేసులు నమోదు చేయవద్దని ఆదేశించాలని రామ్ గోపాల్ వర్మ ఆ పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా ఆయన కోరారు. ఇదిలా ఉంటె రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా నుంచి వర్మ కోసం వచ్చిన పోలీసులు ఐదు రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేశారు. వర్మ కోసం వెతుకుతున్న ఆయన మాత్రం పోలీసులకు చిక్కకుండా పలు టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉండడం పోలీసుల్లో ఆగ్రహం నింపుతుంది.

వర్మకు తాను చేసిన తప్పేమిటో బాగా తెలుసు. రెండు, మూడు టీవీ చానళ్లకు పిలిపించుకుని తనదైన సుత్తి చెప్పి కన్ ఫ్యూజ్ చేయవచ్చని అనుకుంటున్నారో.. లేక తనను అరెస్టు చేసి కొడతారని జాతీయ మీడియా చానళ్లన్నింటికీ ట్యాగ్ చేసి చెబితే.. పోలీసులు వెనక్కి తగ్గుతారని అనుకుంటున్నారో కానీ.. రోజు రోజుకు వర్మ.. మరింత కూరుకుపోతున్నారు.

Read Also : Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…