Site icon HashtagU Telugu

Polavaram Project : షెడ్యూల్‌ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల రామానాయుడు

Polavaram work as per schedule: Minister Nimmala Ramanaidu

Polavaram work as per schedule: Minister Nimmala Ramanaidu

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు పనులు షెడ్యూల్‌కు అనుగుణంగా వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో మంగళవారం అధికారులతో కలిసి మంత్రి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027 సంవత్సరం చివరి నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించాం. వర్షాకాలంలోనూ పనులు నిలిపేయకుండా కొనసాగించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాం. బట్రస్‌ డ్యామ్ పనులు దీనిలో భాగంగా పూర్తయ్యాయి అని మంత్రి తెలిపారు.

Read Also: Telangana Rains : గాలివాన తిప్పలు.. పిడుగులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రంతా జాగారం

ప్రస్తుతానికి పోలవరం హెడ్ వర్క్స్‌ పనులు 80 శాతం మేరకు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుండటంతో ఓర్వలేక కొన్ని రాజకీయ వర్గాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పోలవరం గురించి సరైన అవగాహన లేకుండా, ఇది ఎప్పుడూ పూర్తవుతుందో చెప్పలేం అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రాజెక్టు పనులు స్పష్టమైన దిశలో జరుగుతున్నాయి. నిర్మాణ నాణ్యతపై ఎలాంటి రాజీ చేయకుండా, జాతీయ ప్రాజెక్టుగా గౌరవం పొందిన పోలవరం పనులు మెరుగైన ప్రమాణాలతో సాగుతున్నాయి అని రామానాయుడు స్పష్టం చేశారు.

పోలవరం పూర్తయిన తర్వాత ఏపీ రాష్ట్రానికి పెనుళ్ళ లాభాలు లభిస్తాయని, నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు సాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే ప్రాజెక్టు ద్వారా తాగునీటి పంపకాలు మెరుగుపడి, భూగర్భ జలాలు కూడా పునరుత్థానమవుతాయని వివరించారు. ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని, ప్రజలకు నిజాలను తెలియజేయడమే తమ బాధ్యత అని మంత్రి తెలిపారు. రాజకీయ విమర్శలు చేయడం కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు.

Read Also: NCW : కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌