వ‌చ్చే జూన్ నాటికి పోల‌వ‌రం ప‌ర‌వ‌ళ్లు.. 2వేలా 33కోట్ల కేంద్ర బకాయికి ఏపీ ఎదురుచూపు

ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజ‌నీర్లు చెబుతున్నారు. వ‌చ్చే ఖ‌రీఫ్ నాటికి తొలి విడ‌త నీటిని విడుద‌ల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:18 PM IST

ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోల‌వ‌రం ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజ‌నీర్లు చెబుతున్నారు. వ‌చ్చే ఖ‌రీఫ్ నాటికి తొలి విడ‌త నీటిని విడుద‌ల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది. వ‌చ్చే ఏడాది జూన్ నాటికి కుడి, ఎడ‌మ కాల్వ‌ల‌కు నీళ్లు ఇచ్చేలా ప్రాజెక్టు పూర్తయ్యేలా ప‌నులు జ‌రుగుతున్నాయి.
ఆరు నెల‌ల నుంచి కేంద్రం నుంచి రావ‌ల్సిన బిల్లులు రాక‌పోవ‌డంతో ఏపీ స‌ర్కార్ ఇబ్బంది ప‌డుతోంది. ప్ర‌స్తుతం పూర్తి చేసిన ప‌నుల‌కు కేంద్రం నుంచి 2వేల33కోట్లు కేంద్రం విడుద‌ల చేయాలి. అందుకు సంబంధించిన బిల్లుల‌ను పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ, సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ నుంచి క్లియ‌రెన్స్ కోసం ఫైనాన్స్ విభాగం వ‌ద్ద‌కు చేరాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం 11వేల‌, 181 కోట్ల‌ను ప్రాజెక్టు ప‌నులకు ఇచ్చింది. వాటిల్లో భూ సేక‌ర‌నణ‌, స‌హాయ పున‌రావాసం కోసం ఖ‌ర్చు పెట్టారు. న‌వంబ‌ర్ నాటికి కాప‌ర్ డ్యామ్ పూర్తి కానుంది. ఆ త‌రువాత వ‌ర‌ద నీటిని పూర్తి స్థాయిలో నియంత్ర‌ణ చేసే ఎర్త్ క‌మ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపడ‌తారు. వ‌చ్చే జూన్ నాటికి ఎడ‌మ‌, కుడి కాల్వ‌ల పూర్తి నిర్మాణం జ‌రుగుతుంది. ఆ మేర‌కు ప్రాజెక్టు ఇంజ‌నీర్లు వెల్ల‌డించారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యిన త‌రువాత గ్రావిటీ మీద నీటిని విడుద‌ల చేయ‌నున్నారు. కుడి కాల్వ ద్వారా విశాఖ పట్నం వ‌ర‌కు గ్రావిటీ మీద నీటి ప్ర‌వాహం ఉంటుంది. అక్క‌డ నుంచి పంపింగ్ ద్వారా శ్రీకాకుళం కు నీటిని తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. ఇక ఎడ‌మ కాల్వ ద్వారా ప్ర‌కాశం బ్యారేజికి గ్రావిటీ ద్వారా నీళ్ల ప్ర‌వాహం ఉంటుంది. అక్కడ నుంచి పంపింగ్ ద్వారా రాయ‌ల‌సీమ‌కు నీటిని పంపించేలా ప్లాన్ చేశారు.
పోల‌వరంప్రాజెక్టు పున‌రావాసం ప‌నులు వేగ‌వంతం చేయ‌డానికి ఎక్కువ మంది ఉద్యోగుల‌ను నియ‌మించారు. భూ సేక‌ర‌ణ‌, కాల‌నీ నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. షెడ్యూల్ ప్ర‌కారం ప్రాజెక్టును పూర్త చేయ‌డానికి ఏపీ స‌ర్కార్ స‌న్న‌ద్ధం అయింది. దీనితో పాటు 14వేల 750 కోట్ల‌తో వివిధ ర‌కాల 58 ప్రాజెక్టులు ఏపీలో నిర్మాణం జ‌రుగుతున్నాయి. కేంద్రం స‌కాలంలో నిధుల‌ను విడుద‌ల చేస్తే, వ‌చ్చే జూన్ నాటికి పోల‌వ‌రం నీటిని ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ప్ర‌వ‌హించ‌నున్నాయి. సో..ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాల త‌ర‌హాలో రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ను త్వ‌ర‌లోనే చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.