Polavaram : జ‌గ‌న్ కు ఢిల్లీ షాక్‌! పార్ల‌మెంట్ లో ఏపీ స‌ర్కార్ భాగోతం!

పోల‌వ‌రం(Polavaram) ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి కానుందో పార్ల‌మెంట్ వెల్ల‌డించింది.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 01:29 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఢిల్లీ నుంచి షాకుల మీద షాక్ లు త‌గులుతున్నాయి. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీ స‌ర్కార్ భాగోతం బ‌య‌ట ప‌డుతోంది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం(Polavaram) ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి కానుందో చెప్ప‌లేమ‌ని పార్ల‌మెంట్ వెల్ల‌డించింది. ప్ర‌త్యేక హోదా(Special status) అంశాన్ని మ‌ర‌చిపోవాల‌ని సూచించింది. దాన్ని ముగిసిన అధ్యాయంగా భావించాల‌ని మ‌రోసారి చెప్పింది. ఏపీకి ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి(Amaravathi)అంటూ పార్ల‌మెంట్ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం రూ.2వేల 500కోట్లు అమ‌రావ‌తి అభివృద్ధి కోసం ఇచ్చిన‌ట్టు తెలిపింది. ఈ మూడు ప్రధాన అంశాల విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ త‌ప్పుబ‌ట్టేలా పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం స్పందించింది.

ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత పోల‌వ‌రం(Polavaram), విశాఖ రైల్వే జోన్, రాజ‌ధాని, ప్ర‌త్యేక హోదా(Special Status), వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు నిధులు త‌దిత‌ర హామీల‌ను కేంద్రం నెర‌వేర్చాలి. జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం(Polavaram)ను విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టారు. దానికి సంబంధించిన నిధుల‌ను కేంద్రం పూర్తిగా భ‌రించ‌డంతో పాటు ప్రాజెక్టును నిర్మించాలి. కానీ, ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించుకోవడానికి సిద్ధం అయింది. ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వ‌రంగా మార్చేసి చంద్ర‌బాబు ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగ‌వంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. 2019 ఎన్నిక‌ల నాటికి 80శాతం పూర్తి చేశామ‌ని ఆనాడు టీడీపీ ప్ర‌క‌టించింది. మిగిలిన నిర్మాణాన్ని ఇప్పుడున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం 2022 నాటికి పూర్తి చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఇరిగేష‌న్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కూడా అదే చెప్పారు. కానీ, ఇప్పుడున్న మంత్రి అంబ‌టి రాంబాబు మాత్రం పోలవ‌రం(Polavaram) ఎప్పుడు పూర్తి కానుందో చెప్ప‌లేక‌పోతున్నారు. అదే విష‌యాన్ని పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో కేంద్రం వెల్ల‌డించింది.

మూడు రాజ‌ధానుల కోసం

మూడు రాజ‌ధానుల కోసం స‌మ‌గ్ర బిల్లును తీసుకొస్తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. ఆ దిశ‌గా ప్ర‌జ‌ల‌ను ఆలోచింప చేసేలా గ‌ర్జ‌న‌ల‌ను పెడుతున్నారు. ఉత్తరాంధ్ర గ‌ర్జ‌న‌ను విశాఖ కేంద్రంగా వైసీపీ పెట్టింది. ఇటీవ‌ల తిరుప‌తి కేంద్రంగా రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న నిర్వ‌హించడం ద్వారా మూడు రాజ‌ధానుల అంశాన్ని ఫోక‌స్ చేశారు. ఇంకో వైపు ఏకైక రాజధాని అమ‌రావ‌తి(Amaravathi) మాత్ర‌మే ఉండాల‌ని రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మ‌హా పాద‌యాత్ర కు దిగారు. మూడున్న‌రేళ్లుగా వాళ్లు ఆందోళ‌న చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీల‌న్నీ అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తు ప‌లుకుతుంటే, ఒక్క వైసీపీ మాత్రం మూడు రాజ‌ధానులు ఉండాల‌ని భీష్మించింది. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. ఇదే అంశాన్ని పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ప్ర‌స్తావించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఒక‌టే అంటూ కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, రాజ‌ధాని కోసం రూ. 2,500కోట్లు ఇచ్చిన విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు గుర్తు చేసింది.

దేవుడి ద‌య‌కు

విభ‌జ‌న హామీల్లో ప్ర‌త్యేక హోదా(Special Status) ప్ర‌ధాన‌మైన‌ది. ఆ హామీ కోసం ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ఉద్య‌మాల‌ను చూశాం. అధికారంలోకి వ‌స్తే ప్ర‌త్యేక‌హోదా సాధిస్తాన‌ని ప్రామిస్ చేశారు. మూడున్న‌రేళ్లుగా ఆయ‌న‌ ప్ర‌త్యేక హోదాపై ఒత్తిడి తెచ్చిన పాపాన పోలేదు. దేవుడి ద‌య‌కు ఆ హామీని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌దిలేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వైసీపీ ప‌లు అంశాల్లో మ‌ద్ధ‌తు ఇస్తూ కూడా ప్ర‌త్యేక హోదాను క‌నీసం అభ్య‌ర్థించ‌లేక‌పోతోంది. ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న ఇక లేద‌ని శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌రోసారి కేంద్రం స్ప‌ష్టం చేసింది. నీతి ఆయోగ్ సిఫారస్సుల మేర‌కు ఆర్థిక స‌హాయం ఏపీకి అందిస్తున్నామ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. ఆ స‌మ‌యంలోనైనా వైసీపీ ఎంపీలు ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేయ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయారు. దీనితో పాటు విశాఖ రైల్వే జోన్, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు నిధులు, విభ‌జ‌న హామీ ల గురించి టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ కు ప్ర‌శ్న‌లు వేశారు. వాటికి కేంద్రం ఇచ్చిన స‌మాధానం ఆధారంగా ప్ర‌త్మేక హోదా, పోల‌వ‌రం, అమ‌రావతి(Amaravathi) రాజ‌ధాని, విశాఖ రైల్వే జోన్ త‌దిత‌రాల‌పై ఏపీ ప్ర‌భుత్వం క్లారిటీగా లేద‌ని అర్థం అవుతోంది. ఆ దిశ‌గా కేంద్రం ఇచ్చిన స‌మాధానం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టేలా ఉంది.