Site icon HashtagU Telugu

Janasena : మారువేషంలో ప్రభుత్వ ఆఫీస్ కు వెళ్లిన జనసేన ఎమ్మెల్యే..

Mla Chirra Balaraju Decided

Mla Chirra Balaraju Decided

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రమే కాదు ..ఆ పార్టీ ఎమ్మెల్యేలు (Janasena MLAS) సైతం పాలనలో తమ మార్క్ చూపిస్తున్నారు. తమ అధినేత కు మా వల్ల ఎక్కడ చెడ్డ పేరు రావొద్దని..ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ సమస్య వచ్చిన నేనున్నా అంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేస్తూ వస్తున్నారు. వీరిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Polavaram MLA Chirri Balaraju) నిత్యం సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ లోని అశ్వరావు పేట నియోజకవర్గంలో పెద్దవాగు తెగిపోయి..రైతులు వరదలో చిక్కుకోవడం తో వెంటనే హెలికాఫ్టర్ పంపించి 20 మంది రైతులను ఆదుకున్నారు. ఈ ఘటన ఆయనపై ఉన్న గౌరవాన్ని ఎంతో పెంచింది. తమ నియోజకవర్గం కాకపోయినా..అసలు తన రాష్ట్రమే కాకపోయినా ఆపదలో ఉన్నారని తెలిసి స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించి తన బాధ్యతను చాటుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రభుత్వ సిబ్బంది పనితీరు ఎలా ఉందొ తెలుసుకోవాలని స్వయంగా వెళ్లారు. అది కూడా మాములుగా ఎమ్మెల్యే గా కాదు మారువేషంలో వెళ్లి పరివేక్షించారు. కేఆర్‌పురం ఐటీడీఏ కార్యాలయానికి ఫస్ట్ టైం బాలరాజు వెళ్లారు. ముఖానికి మాస్కు పెట్టుకుని సామాన్యూడిలా ఐటీడీఏ కార్యాలయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేను గమనించని ఉద్యోగి సాయి కుమార్ ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పజ్జీ గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు సమయంలో పజ్జీ గేమ్ ఆడటం ఏంటి అని. సాయి కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఘటన తో ఆఫీస్ లో అంత హడలిపోయారు. ఈయన మాత్రమే కాదు అటు తెనాలి ఎమ్మెల్యే మనోహర్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్నారు. ఎక్కడిక్కడే తనిఖీలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

Read Also : YS Sharmila : జగన్ నీ మూర్ఖత్వానికి నిన్ను మ్యూజియంలో పెట్టాలి – వైస్ షర్మిల