Polavaram Finance : కేంద్ర ఆర్థిక స‌హాయం వెనుక `పోల‌వ‌రం` కుట్ర‌

Polavaram Finance : ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ను ను కేంద్రం విడుద‌ల చేసింది.

  • Written By:
  • Updated On - May 24, 2023 / 02:15 PM IST

Polavaram Finance : ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ను ను కేంద్రం విడుద‌ల చేసింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పండ‌గ చేసుకుంటోంది. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న ప్ర‌భుత్వానికి ఇంత పెద్ద మొత్తం ఊరట కింది చెప్పుకోవాలి. కానీ, దీని వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆర్థిక నిపుణులు బ‌య‌ట‌పెడుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టుకు(Polavaram Finance) ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతూ ఈ నిధులు ఇచ్చార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే, కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీ మీద పెద్ద కుట్ర‌కు తెర‌లేపినట్టే.

ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక లోటు కింద  రూ. 10వేల 500 కోట్ల‌ (Polavaram Finance)

ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం జాతీయ ప్రాజెక్టుగా పోల‌వ‌రం ఉంది. ఆ ప్రాజెక్టును(Polavaram Finance)కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి. కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి దాని నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించింది. దాన్ని ఏటీఎంగా ఆనాటి ప్ర‌భుత్వం వాడుకుంద‌ని రాజ‌కీయ ప్ర‌చార స‌భ‌ల్లో మోడీ ఆరోపించారు. ఆ త‌రువాత మోడీకి ఇష్ట‌మైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి పోల‌వ‌రం ప‌నులు రివ‌ర్స్ తీసుకున్నాయి. ఎత్తు త‌గ్గించ‌డానికి కేంద్రం ఒత్తిడి తెచ్చింది. ఎత్తు త‌గ్గించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రిస్తే, ఖ‌ర్చు రూపంలో భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి కేంద్రం ఎత్తుగ‌డ వేసింది. క‌నీసం 10వేల కోట్ల‌కు పైగా కోత పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ఆ విష‌యాన్ని వెలుగొత్తింది. పోల‌వ‌రం ఎత్తుత‌గ్గించ‌డానికి లేద‌ని డిమాండ్ చేసింది.

కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీ మీద పెద్ద కుట్ర‌

ఒక వేళ పోల‌వ‌రం ఎత్తు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంటే రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని గుట్టుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) స‌ర్కార్ చేస్తోంది. కేంద్రం అడుగులకు మ‌డుగులు ఒత్తుతోంది. పోల‌వ‌రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు డిజైన మార్చ‌డానికి లోపాయికారిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంగీక‌రిస్తూ వారం క్రితం సంత‌కాలు పెట్టార‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే, 2014 -15వ ఆర్థిక సంవ‌త్స‌రం ఆర్థిక లోటు కింద ఇప్పుడు రూ. 10వేల 500 కోట్లు కేంద్రం విడుద‌ల చేసింద‌ని చెబుతున్నారు. అంత‌కంటే ఎక్కువ‌గా పోల‌వ‌రం ప్రాజెక్టు (Polavaram Finance)నిర్మాణ వ్య‌యాన్ని త‌గ్గించుకునేలా కేంద్రానికి ప‌త్రాలు ఇచ్చిన త‌రువాత ఇదంతా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : Polavaram : KCR చెప్పిన‌ట్టే కేంద్రం! పోల‌వ‌రం ఎత్తు కుదింపు!

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత పోల‌వ‌రంను 2021నాటికి పూర్తి చేస్తామ‌ని అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. ఆనాడున్న ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత 2022 అన్నారు. ప్ర‌స్తుత నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఎప్పుడు పూర్తి అవుతుందో ఇతిమిద్ధంగా చెప్ప‌లేమ‌ని ప్ర‌క‌టించారు. గ‌త చంద్ర‌బాబునాయుడు డ‌యాఫ్రం వాల్ నిర్మాణం విష‌యంలో చేసిన సాంకేతిక‌లోపం కార‌ణంగా ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్ప‌లేమ‌ని బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. మీడియా స‌మావేశాల్లో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం గురించి అడిగితే క‌రిచేలా అంబ‌టి విలేక‌రుల‌కు స‌మాధానం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల న‌డుమ రూ. 10వేల 500కోట్లు ఆర్థిక లోటు కింద విడుద‌ల చేసిన కేంద్రం ఉదార‌తపై అధ్య‌య‌నం చేయ‌గా, పోల‌వ‌రం(Polavaram Finance) కుదింపు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజీప‌డ్డార‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వాలు పూర్తిగా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

Also Read : Polavaram Issue: పోలవరం ఆలస్యానికి అసలు కారణమిదే!