Polavaram Fight : పోల‌వ‌రంపై ఎవరిమాట వాళ్లదే.!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారిగా పోల‌వ‌రం (Polavaram Fight) మీద స్పందించారు. ఎప్పుడు పూర్తి చేస్తారు? అనేది మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 01:47 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారిగా పోల‌వ‌రం (Polavaram Fight) మీద స్పందించారు. కానీ, ఆ ప్రాజెక్టుల‌ను ఎప్పుడు పూర్తి చేస్తారు? అనేది మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌రిహారం గురించి గుడ్ న్యూస్ కేంద్రం నుంచి వ‌స్తుంద‌ని తాజాగా ఆయ‌న హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తును త‌గ్గించ‌డానికి కేంద్రం ఇచ్చిన సంకేతానికి ఆయ‌న అంగీక‌రించారు. అందుకే, ఇప్పుడు నిధుల మోతాదును కూడా 10వేల కోట్ల వ‌ర‌కు త‌గ్గించార‌ని టీడీపీ చెబుతోంది. మొద‌టి దశలో 41.15మీటర్ల వరకు నీరు నింపే ప్రయత్నాలు జరుగుతుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. ఇక దానికి ఫిక్స్ కావాల‌ని టీడీపీ అనుమానిస్తోంది. ఆమేర‌కు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని తొలి నుంచి టీడీపీ చెబుతోంది.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలిసారిగా పోల‌వ‌రం మీద(Polavaram Fight)

డామ్ సేఫ్టీ ప్రకారం ప్రాజెక్టులో మూడు దశల్లో నీరు నింపాల్సి ఉందని సిడ‌బ్ల్యూసీ చెబుతోంద‌ని జ‌గ‌న్ వివ‌రించారు. మొదటి దశలో లీకులు పరిశీలించడానికి కొంత మేరకు మాత్రమే నీటిని నింపాల్సి ఉందని అన్నారు. సెక్యూరిటీ ప్రమాణాల ప్రకారం 41.15మీటర్ల ఎత్తులో తొలి దశలో నీటిని నింపాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. మొదటి దశలో నీరు నిలబెట్టినా 48గ్రామాలు కటాఫ్ జాబితాలో చేరుతున్నాయని అన్నారు. బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ కోల్పోతారని, వాటిని గుర్తించడానికి లిడార్ సర్వే చేపట్టి 32గ్రామాలలో సర్వే చేపట్టి 48 ఆవాసాలను గుర్తించి (Polavaram Fight) వాటి వివరాలను కేంద్రానికి పంపించామ‌ని ముంపువాసుల‌కు వివ‌రించారు.

గోదావ‌రి జిల్లాల‌కు చేరుకున్న చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్

మంత్రి అంబ‌టి రాంబాబు ప్రాజెక్టు వివ‌రాల‌కు బ‌దులుగా కేంద్రం నుంచి చంద్ర‌బాబు ఎందుకు నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకున్నారు? అంటూ పాత క‌థ‌ను వినిపించారు. సీఎం హోదాలో జ‌గన్మోహ‌న్ రెడ్డి ప్రాజెక్టు మీద రివ్యూ చేయ‌డమే కాదు, ప్రాజెక్టు వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిశీలించారు. మ‌రో వైపు చంద్ర‌బాబునాయుడు గ‌త వారం నుంచి ప్రాజెక్టుల(Polavaram Fight) సంద‌ర్శ‌న చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగా ప్రాంతాల‌వారీగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కార‌ణంగా ప్రాజెక్టుల్లో జ‌రిగిన నిర్ల‌క్ష్యాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రిస్తున్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించిన ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన్నారు. ఆ సంద‌ర్భంగా క‌ర్నూలు, చిత్తూరు జిల్లా పుంగ‌నూరు వ‌ద్ద వైసీపీ, టీడీపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ప్రాజెక్టుల సంద‌ర్శ‌న లో భాగంగా గోదావ‌రి జిల్లాల‌కు చేరుకున్న చంద్ర‌బాబు పోల‌వ‌రం మీద ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

Also Read : Polavaram : KCR చెప్పిన‌ట్టే కేంద్రం! పోల‌వ‌రం ఎత్తు కుదింపు!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిపై చంద్రబాబు పట్టిసీమ, పోలవరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. 2004 నుంచి పాలకుల వైఖరి కారణంగా ప్రాజెక్టు.(Polavaram Fight) రెండుసార్లు బలైందని ఆరోపించారు. 2004లో మధుకాన్, శీనయ్య సంస్థలకు టెండర్లు దక్కాయని, కానీ వాటి పనులు రద్దు చేశారని గుర్తు చేశారు. పోలవరంలో 2004 నుంచి 2014 వరకు జరిగింది ఐదు శాతం మాత్ర‌మేనంటూ వెల్ల‌డించారు. వాస్త‌వంగా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి 2021 నుంచి అనేక తేదీలు ప్రకటిస్తూ వ‌చ్చింది.

Also Read : Polavaram : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష

ప్రాజెక్టు నిర్మాణం తేదీని ప్ర‌కటించ‌డానికి కూడా ముందుకురాలేని దుస్థితికి వెళ్లిన ఏపీ స‌ర్కార్ కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వ‌స్తుంద‌ని చెబుతోంది. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భూ నిర్వాసితుల‌కు హామీ ఇవ్వ‌డం విడ్డూరం. ఇక మంత్రి అంబ‌టి మాత్రం తొలి నుంచి చెప్పిందే చెబుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎలా నిర్మించారు? 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అని మూడు ప్రశ్నలు చంద్ర‌బాబుకు సంధించారు. అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మొత్తం మీద ఒకేరోజు చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం లెక్క‌ల్ని తీయ‌డం రాజ‌కీయ రచ్చ‌గా మారింది.