Polavaram : KCR చెప్పిన‌ట్టే కేంద్రం! పోల‌వ‌రం ఎత్తు కుదింపు!

కేసీఆర్ కోరిన విధంగా పోల‌వ‌రం(Polavaram) ఎత్తును కేంద్రం కుదించింది.

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 05:56 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కోరిన విధంగా పోల‌వ‌రం(Polavaram) ప్రాజెక్టు ఎత్తును కేంద్రం కుదించింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో (Jagan-kcr)ఉన్న అనుబంధం పోల‌వ‌రం ఎత్తు మీద ప‌డింద‌ని స‌ర్వ‌త్రా ఏపీలోని సాగునీటి నిపుణులు, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. పోల‌వరం ఎత్తును తగ్గించాల‌ని చాలా కాలంగా సీఎం కేసీఆర్ కోరుతున్నారు. భ‌ద్రాచ‌లం మునిగిపోకుండా ఎత్తు త‌గ్గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కోరుతోంది. తొలి ఆత్మీయ క‌ల‌యిక‌లోనే ఏపీ స‌చివాల‌యాన్ని రాసిచ్చిన జ‌గ‌నోహ్మ‌న్ రెడ్డి తెర‌వెనుక పోల‌వ‌రం ఎత్తు త‌గ్గింపును కూడా అంగీక‌రించార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం విదిత‌మే. ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌కు త‌గిన విధంగా పోల‌వ‌రం ఎత్తును 41.15 మీట‌ర్ల‌కు పరిమితం చేస్తూ కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది.

కేసీఆర్ కోరిన విధంగా పోల‌వ‌రం  ఎత్తు (Polavaram)

ప్రస్తుతానికి ప్రాజెక్టు (Polavaram)ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం స్ప‌ష్టం చేసింది. అంత మేరకే నీటిని నిల్వ ఉంటుంద‌ని తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం కూడా అంత వరకేనని వివ‌రించింది. లోక్ సభ లో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రాతపూర్వకంగా ఆ మేర‌కు సమాధానమిచ్చారు. ‘‘తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉంది. 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయం, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే కల్పించాల్సి ఉంది. అవి ఇంకా పూర్తి చేయలేదు’’ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం (Jagan-Kcr)ఇప్పటిదాకా కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయం, పునరావాసాన్ని కల్పించిందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. సహాయ, పునరావాసాలు ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా.. అందులో జాప్యం జరిగిందని వివరించారు.

సహాయం, పునరావాసాన్ని జాప్యం 

కేంద్రం ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి (Polavaram) ఎత్తుగ‌డ వేసింది. తెలంగాణ‌, ఒడిస్సా ప్ర‌భుత్వాల అభ్యంత‌రాల‌ను బూచిగా చూపుతూ ఎత్తును త‌గ్గించింది. వాస్త‌వంగా డిజైన్ ప్ర‌కారం 45.72 మీట‌ర్ల ఎత్తు ఉండాలి. కానీ, దాన్ని 41.15 మీట‌ర్ల‌కు కుదించింది. అంటే, సుమారుగా సుమారుగా 4 మీట‌ర్ల‌కు పైగా ఎత్తున (Polavaram) త‌గ్గించ‌డం ద్వారా కేంద్రానికి భారీగా నిధుల‌ను మిగిలే అవ‌కాశం ఉంది. అందుకే, కేసీఆర్ డిమాండ్ ను బూచిగా చూపుతూ కేంద్రం డ్రామాలు ఆడుతోంది. అందుకు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan-Kcr) కూడా త‌లాడిస్తున్నార‌ని త‌ర‌చూ వినిపించే ఆరోప‌ణ‌.

Also Read : TS Urges Polavaram: పోల‌వ‌రంపై తెలంగాణ మ‌రో ఫిర్యాదు

పోలవరం రిజర్వాయర్ లెవల్ 150 అడుగుల నీటి మ‌ట్టం కంటే తక్కువగా(Polavaram) ఉంటే ప్రాజెక్టు నుంచి ఆశించిన ప్రయోజనాలు అందడం అసాధ్యమని కేంద్ర జల సంఘం ఎప్పుడో చెప్పింది. పోలవరం రిజర్వాయర్ లెవల్ 140 అడుగులు, 150 అడుగుల మధ్య కాంటూర్ లో సహాయ పునరావాస కార్యక్రమాలకు రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని రాత‌పూర్వ‌కంగా ప్ర‌స్తావించింది. అయితే, ఖర్చు తగ్గించుకోవడానికి కేంద్రం ప్రాజెక్టు ఎత్తును 140 అడుగులకు కుదించవలసిందిగా రాష్ట్రంపై (Jagan-Kcr)ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ విష‌యాన్ని మాజీ ఎంపీ కేవీపీ కూడా ప‌లుమార్లు వెల్ల‌డించారు.

కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య సాన్నిహిత్యం

‘పోలవరం ప్రాజెక్టు (Polavaram)నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో, భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దని ప్ర‌త్య‌ర్థి పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. పోలవరాన్ని పూర్తి స్థాయిలో, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందించడానికి కట్టబడి ఉంటారని ఆశిస్తున్నా’ అంటూ ఇటీవ‌ల కేవీపీ లేఖలో పేర్కొన్నారు. పోలవరం నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమని, నిధులు లేవని కేంద్రం పోలవరం ఎత్తు తగ్గించే ఆలోచనలో ఉందని లేఖలో ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం రాష్ట్రం చేతుల్లో ఉందని.. కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తలొగ్గవద్దని సూచించారు. ఎత్తు తగ్గితే రాష్ట్రం చాలా నష్టపోతుందని సాగునీటి నిపుణులు, విప‌క్ష లీడ‌ర్లు అంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan-Kcr) మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం, కేంద్రం నిధుల కొర‌త వెర‌సి పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి కేంద్రం అన్యాయం చేసింద‌ని చెప్పుకోవాలి.

Also Read : Polavaram : జ‌గ‌న్ కు ఢిల్లీ షాక్‌! పార్ల‌మెంట్ లో ఏపీ స‌ర్కార్ భాగోతం!