Traffic Diversions: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మే 2న అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమం, సంబంధిత బహిరంగ సభ సజావుగా నిర్వహించడానికి ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) అమలు చేయనున్నారు. ఈ ట్రాఫిక్ ఏర్పాట్లు జాతీయ, రాష్ట్ర రహదారులపై రద్దీని నివారించి, ప్రజల సౌకర్యం కోసం ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.
భారీ వాహనాలు, లారీల మళ్లింపులు
చెన్నై నుండి విశాఖపట్నం (విజయవాడ, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా): భారీ గూడ్స్ వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగుంట నుండి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించబడతాయి. విశాఖపట్నం నుండి చెన్నైకి వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి.
చిలకలూరిపేట నుండి విశాఖపట్నం: వాహనాలు NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడతాయి.
చెన్నై నుండి విశాఖపట్నం (బోయపాలెం క్రాస్): వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Also Read: Full Operational Freedom: పాక్‌తో యుద్ధానికి సిద్ధమైన భారత్.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
గుంటూరు నుండి విశాఖపట్నం: వాహనాలు బుడంపాడు క్రాస్ నుండి తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడతాయి.
గన్నవరం నుండి హైదరాబాద్: వాహనాలు ఆగిరిపల్లి, శోభనాపురం, గణపవరం, మైలవరం, జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి.
విశాఖపట్నం నుండి హైదరాబాద్: భారీ గూడ్స్ వాహనాలు హనుమాన్ జంక్షన్ నుండి నూజివీడు, మైలవరం, జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపు కూడా ఇదే మార్గం అనుసరించాలి.
మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు సూచనలు
చెన్నై నుండి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారి వద్ద ఆపబడతాయి.
విశాఖపట్నం నుండి చెన్నై: హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఆపబడతాయి. ఆపబడిన మల్టీ-యాక్సిల్ వాహనాలు 2025 మే 2 రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగవచ్చు. ప్రయాణీకులు ట్రాఫిక్ సజావుగా సాగేలా సహకరించాలని మంగళగిరి పోలీసు అధికారులు కోరతున్నారు. మీడియా సంస్థలు ప్రజల భద్రత కోసం ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.