Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌ల సెగ‌, బంద్ షురూ!

ప్ర‌ధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా ప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నంలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీట‌ర్ వ‌ర‌కు మాత్రమే అనుమ‌తినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌ధాని రాక‌ను నిర‌సిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు స‌మాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పల‌క‌డానికి క‌మ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మ‌రో వైపు టీఆర్ ఎస్వీ నిర‌స‌న‌ల‌కు పిలుపు ఇవ్వ‌డ‌మే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 02:53 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11,12 తేదీల్లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ ర‌చ్చ‌ను రాజేసింది. విశాఖలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఈనెల 11న మోడీ పాల్గొంటారు. 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణకు వస్తున్న పీఎం మోదీకి 8 డిమాండ్లతో తెలంగాణ మేధావులు బహిరంగ లేఖను సంధించారు. విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని, తెలంగాణ పట్ల వివక్ష పూరిత ధోరణి విడనాడాలని కోరారు. మతతత్వ ధోరణి వీడి, దేశ ఐక్యతను కాపాడేలా పాలించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేసిన మోదీ వైజాగ్ కు ఎందుకు వస్తున్నారని కార్మికులు, విప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణకు ఏమీ చేయని మోదీ రామగుండంకు ఎందుకు వస్తున్నారని నిల‌దీస్తున్నారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతామని సీపీఐ నేత నారాయణ వెల్ల‌డించారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో నిర‌స‌న‌లు
శనివారం ప్రధాని రాక సందర్భంగా రామగుండంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కోసం ప్రధాని రావ‌డాన్ని టీఆర్ఎస్ వ్యతికేకిస్తోంది. సింగరేణి కార్మికుల ఆందోళన నిర్వహిస్తున్నారు. మోదీ గో బ్యాక్‌ అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధం అయ్యారు. శుక్రారం, శనివారం సింగరేణిలో నిరసన కార్యక్రమాలు నిర్వ‌హించ‌డానికి రెడీ అయ్యారు.బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. మరోవైపు ఈనెల 12 మోదీ పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ జేఏసీ తీర్మానించింది. ఆ రోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలతో ఆందోళన చేపట్టనున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎలా అడుగుపెడుతారని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిల‌దీస్తోంది.

వైజాగ్ లో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌
ప్రధాని మోదీ పర్యటన నేపధ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహ‌రించారు. విశాఖ నగరంలో హై టెన్షన్‌ నెలకొంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్ష పార్టీలు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముంద‌స్తుగా కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు.

మోడీ పర్యటన షెడ్యూల్ ఇదీ
ఈ నెల 11న సాయంత్రం మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి ప్ర‌ధాని మోడీ చేరుకుంటారు. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచే రూ. 10,742 కోట్ల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక‌, పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఉదయం 10.30 నుంచి 11.45 గంటల వరకు ఈ కార్యక్రమానికి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఆ త‌రువాత విశాఖపట్నం నుంచి రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొంది. రామగుండంలో ఆర్ ఎఫ్ సీ ఎల్ సహా మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయ‌డంతో పాటు శంకుస్థాపనలు చేస్తారని పీఎంవో తెలిపింది. శంకుస్థాపన అనంతరం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.