Araku Coffee: అరకు కాఫీపై ప్ర‌ధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమ‌న్నారంటే..?

  • Written By:
  • Updated On - June 30, 2024 / 04:25 PM IST

Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో క‌లిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ త‌ర్వాత దీని గురించి ట్వీట్‌లో తెలిపారు.

భారతదేశం నుండి చాలా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారతదేశంలోని స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వపడటం సహజం. అలాంటి ఉత్పత్తి అరకు కాఫీ. అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్ద మొత్తంలో పండిస్తారు. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అరకు కాఫీ సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేస్తూ సుమారు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు అరకు కాఫీని పండిస్తున్నాయి. అరకు కాఫీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో గిరిజన సహకార సంఘం కీలక పాత్ర పోషించింది.

Also Read: Cashless Payments: ఖ‌ర్చులు బాగా పెంచిన నగదు రహిత చెల్లింపులు..!

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్‌తో కలిసి కాఫీ సేవిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. కాఫీ తోటల సేద్యానికి, గిరిజనుల అభివృద్ధికి మధ్య గట్టి అనుబంధం ఉందని వెల్లడించారు.

ఇక్కడి రైతు సోదర, సోదరీమణులను ఏకతాటిపైకి తెచ్చి అరకు కాఫీ సాగు చేసేలా ప్రోత్సహించిందన్నారు. ఇది ఈ రైతుల ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచిందన్నారు. నాకు గుర్తుంది. ఒకసారి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఈ కాఫీని రుచి చూసే అవకాశం నాకు లభించింది. అరకు కాఫీ అనేక గ్లోబల్ అవార్డులను అందుకుంది. ఢిల్లీలో జరిగిన జి-20 సమ్మిట్‌లో కూడా కాఫీపై చర్చ జరిగింది’ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో రాసుకొచ్చారు. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రశంసిస్తూ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మంచు బఠానీలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

We’re now on WhatsApp : Click to Join