Site icon HashtagU Telugu

Modi Praise Nara Lokesh : నారా లోకేష్ పై మోడీ ప్రశంసల జల్లు

Modi Lokesh

Modi Lokesh

మోడీ (Modi) ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ప్రశంసలు కురిపించడం , గిఫ్ట్ లు ఇవ్వడం చేస్తుంటారు. అయితే ఈరోజు వైజాగ్ వేదికగా జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించడం తో అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో లోకేష్ (Lokesh) పాత్ర ప్రధానమని, యువతను ఏకం చేయడంలో ఆయన చూపిన సమర్థత అభినందనీయమని అన్నారు.

“ఇంత పెద్ద ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడానికి దృఢ నిశ్చయం, దీర్ఘదృష్టి అవసరం. నారా లోకేష్ గారు గత నెల రోజులుగా చేసిన కృషి ప్రత్యేకంగా గుర్తించాల్సిందే” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించినప్పటికీ, లోకేష్ గురించి ప్రత్యేకంగా పొగడ్తల జల్లు కురిపించడం అందర్నీ ఆకట్టుకుంది. నారా లోకేష్ పేరును ప్రధాని మోదీ వేదికపై సుదీర్ఘంగా ప్రస్తావించడం, ఆయనను “సక్సెస్ బేహైండ్ యోగాంధ్ర”గా పేర్కొనడం అనేది జాతీయ రాజకీయాల్లో లోకేష్ స్థానం పెరుగుతున్నదానికి సంకేతంగా భావిస్తున్నారు. టీడీపీ వారసుడిగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన పాలనదారుడిగా మోదీ గుర్తింపు ఇవ్వడం పార్టీకి పెద్ద ప్రోత్సాహంగా మారింది. ఇది లోకేష్ భవిష్యత్ నాయకత్వం పట్ల బీజేపీ యోచనల్లో మార్పు వచ్చిందా? లేదా జాతీయ స్థాయిలో ఆయనను ముందుకు నెట్టే వ్యూహంలో భాగమా? అన్న చర్చలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి.