Modi – Pawan Kalyan : ఎన్డీయేలో పవన్ కళ్యాణ్ ఎంత కీలకంలో అందరికి తెలిసిందే. ప్రధాని మోదీ కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నూతన సీఎం రేఖాగుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి అనేకమంది ఎన్డీయే నేతలు హాజరవ్వగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
ఈ క్రమంలో స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ని చూసి ప్రత్యేకంగా కరచాలనం చేస్తూ, ఆప్యాయంగా, సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలు వైరల్ అయ్యాయి. మోదీ అంతమందిలో పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడటంతో మరోసారి పవన్ హవా నేషనల్ వైడ్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పవన్ తో సరదాగా మోదీ మాట్లాడటంతో కార్యక్రమం అయ్యాక మీడియా పవన్ ని మోదీ ఏమన్నారు అంటూ ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధానమిస్తూ.. ప్రధాని నాపై చాలా సార్లు సరదాగా జోకులు వేస్తుంటారు. ఈరోజు నా వస్త్రధారణ చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళుతున్నవా అని ప్రధాని అడిగితే అలాంటిదేమీ లేదని, చేయాల్సింది చాలా ఉంది అని అన్నట్టు తెలిపారు.
పవన్ అప్పుడప్పుడు దీక్షలో ఉంటే ప్రత్యేక దుస్తులు ధరిస్తారని తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఢిల్లీకి కూడా అలాగే దీక్షా వస్త్రాలతో వెళ్లడంతో మోదీ ఇలా అన్నారు.
AP Deputy CM Sri @PawanKalyan Garu talking to media about the conversation with Hon'ble PM Sri @narendramodi Garu.pic.twitter.com/tNkhTftMDF
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 20, 2025
Also Read : Vishwak Sen : మీరు అనుకున్న స్థాయిలో నా సినిమాలు లేవు.. లైలా ఫ్లాప్ తర్వాత విశ్వక్ ఎమోషనల్ లెటర్..