Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనను శనివారం విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళాత్మకత, వారసత్వం, సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలిచే ప్రత్యేక బహుమతులు అందజేశారు. మోదీ అందించిన బహుమతులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వైవిధ్యాన్ని, కళానైపుణ్యాన్ని ప్రతిబింబించాయి. అత్యంత ఆకర్షణీయమైన బహుమతులలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో లభించే అరుదైన మూన్‌స్టోన్ (చంద్రకాంత శిల) తో తయారు చేసిన రామెన్ గిన్నెల సెట్. ఈ సెట్‌లో ఒక పెద్ద గిన్నెతో పాటు నాలుగు చిన్న గిన్నెలు, వెండి చాప్‌స్టిక్‌లు ఉన్నాయి. వీటిని తయారు చేసే ప్రక్రియలో జపాన్ సంప్రదాయ ఆహార పద్ధతులైన దొన్‌బురి, సోబా వంటివి స్ఫూర్తిగా తీసుకున్నారు. గిన్నెలు మెరుస్తూ కనిపించేలా పాలిష్ చేయగా, ప్రధాన గిన్నె కిందభాగంలో రాజస్థాన్‌కి చెందిన ‘పార్చిన్ కారీ’ శైలిలో మక్రానా మార్బుల్‌పై రత్నాలతో అలంకరణ చేశారు. ఇది భారతీయ మరియు జపాన్ సంస్కృతుల సమన్వయానికి ప్రతీకగా నిలిచింది.
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, జపాన్ ప్రధాని భార్యకు మోదీ మరో ప్రత్యేక బహుమతిని అందించారు. కశ్మీర్‌లోని చేనేత కళాకారులు లడఖ్‌కి చెందిన చాంగ్‌తాంగి మేక ఉన్నితో నేసిన పశ్మీనా శాలువాను ఆయన బహూకరించారు. ఈ శాలువా తన మృదుత్వం, తేలిక, వెచ్చదనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అదేవిధంగా, పూలు, పక్షుల ఆకృతులతో అందంగా అలంకరించబడిన ఒక పేపియర్-మాచే బాక్స్ను కూడా అందించారు. ఈ కళాకృతి కశ్మీర్‌లో తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రధాని మోదీ అందించిన ఈ బహుమతులు భారతదేశంలోని రాష్ట్రాల ప్రత్యేకతలను మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను బలపరచే వంతెనగా నిలుస్తాయని భావిస్తున్నారు. జపాన్ పర్యటనలో మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త మలుపు అవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు!