Site icon HashtagU Telugu

Amaravati Relaunch : వేదికపై పవన్ కళ్యాణ్ కు మోడీ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

Modi Gift

Modi Gift

Modi Gift To Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం(Amaravati Relaunch)లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Deputy CM Pawan Kalyan)కు ఆసక్తికరమైన గౌరవం లభించింది. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పవన్ కళ్యాణ్‌ను తనవద్దకు పిలిచి స్వయంగా చాక్లెట్‌ను గిఫ్ట్‌గా (Chocolate Gift) అందించారు. ఈ సన్నివేశం సభలో ఉన్నవారిలో ఆసక్తిని కలిగించింది. పవన్ ఆ గిఫ్ట్‌ను ఎంతో ఆనందంగా స్వీకరించగా, పక్కన ఉన్న సీఎం చంద్రబాబు కూడా చిరునవ్వులు చిందించారు. ఈ సన్నివేశం మోదీ, పవన్ మధ్య ఉన్న అనుబంధాన్ని సూచించింది.

పునఃప్రారంభం వేడుకలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, అమరావతి రైతుల త్యాగాన్ని హృదయపూర్వకంగా గుర్తు చేశారు. గత ఐదేళ్లలో అమరావతి రైతులు అనుభవించిన అవమానాలు, బాధలు ఆయన ప్రస్తావించారు. లాఠీ దెబ్బలు తిన్నా, నిరాశకు లోనవ్వకుండ ఆ రైతులు ధైర్యంగా ముందుకు సాగారని తెలిపారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు మళ్లీ ప్రధాని మోదీతో కలిసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభించామని పేర్కొన్నారు. అమరావతి రైతులు భూములు మాత్రమే కాదు, భవిష్యత్తును ఇచ్చారు అనే పవన్ వ్యాఖ్య సభలో చప్పట్లు కొట్టేలా చేసింది.

పవన్ నుండి మోదీకి అభినందనలు – చంద్రబాబు పై ప్రశంసలు

దేశమంతటినీ తన కుటుంబంలా చూస్తూ పాలిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ నమస్కారాలు చేశారు. మోదీకి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరారు. అమరావతిని సైబరాబాద్ తరహాలో అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో మహిళా రైతుల పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేశారు. చివరగా, మోదీ ఏపీపై చూపిన నిబద్ధతకు ఇది చక్కటి ఉదాహరణ అని పవన్ స్పష్టం చేశారు.