Vizag Steel Plant : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. విశాఖపట్నంలో జరిగే ఈ పర్యటనలో ప్రధానంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్: అనకాపల్లి జిల్లా పూడిమడకలో నిర్మితమవుతోన్న ఈ హబ్ పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రెండు దశల్లో లక్షా 85వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రోజుకు 15 వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు అమ్మోనియా, మిథనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేయనున్నారు. సముద్రపు నీటిని డీసాలినేషన్ ద్వారా శుద్ధి చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.
బల్క్ డ్రగ్ పార్క్: ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 1,900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీని ద్వారా 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అంచనా వేస్తున్నారు. 28 వేల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది.
రైల్వే ప్రాజెక్టులు: చిలకలూరిపేట ఆరు వరుసల బైపాస్ రహదారి. నాగార్జునసాగర్-దావులపల్లి ద్విరేక రహదారి విస్తరణ. గుడివాడ-మచిలీపట్నం రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టు. భీమవరం-నిడదవోలు రైల్వే డబ్లింగ్. గుత్తి-ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్.
తిరుపతి క్రిస్‌సిటీ: తిరుపతి జిల్లాలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.
ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఆటో, ఫార్మా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే 37 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరగనుంది.
ఇతర ప్రాజెక్టులు:
- ఆదోని-బైపాస్ రోడ్డు విస్తరణ.
- దోర్నాల-కుంట జంక్షన్ మార్గ విస్తరణ.
- సంగమేశ్వరం-నల్లకాలువ రహదారి.
విశాఖ స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో ఈ పర్యటనలో ప్రధానమంత్రి కీలక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. విశాఖ వేదికగా మోదీ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వగలరని పరిశీలకులు ఆశిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రకటితమయ్యే ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి పునాది వేస్తాయని భావిస్తున్నారు.