Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 2034 వరకు పొడిగించాలని

Hyderabad: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను 2034 వరకు పొడిగించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఇబ్రహీంపట్నం ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదలి అనిల్ కుమార్. ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ), ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అసంపూర్తిగా ఉండటమే తన విజ్ఞప్తికి కారణమని కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జూన్ 2, 2024 వరకు మాత్రమే హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల పాటు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా కొనసాగింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించింది.

కాగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మాత్రమే కాదు, చండీగఢ్, కేంద్రపాలిత ప్రాంతం, పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1966 నుండి పంజాబ్ మరియు హర్యానా రెండింటికీ రాజధానిగా వ్యవహరిస్తోంది.

Also Read: Roja : రోజాకు టికెట్ ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం – అధిష్టానానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక