Site icon HashtagU Telugu

Aircraft on Highway: హైవేపై యుద్ధ విమానాల ల్యాండింగ్.. ట్రయల్ రన్ సక్సెస్

Planes on highway

Planes

జాతీయ రహదారిపై (Highway) విమానాల అత్యవసర ల్యాండింగ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని Andhra pradesh కొరిశపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వంతెన వరకు జాతీయ రహదారిపై విమానాల (Planes) అత్యవసర ల్యాండింగ్‌ కోసం నిర్మించిన రన్‌వేపై ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఒక కార్గో, మూడు జెట్‌లు భూమిపై 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్లు ట్రయల్ రన్ ను ఆసక్తిగా తిలకించారు.

16వ జాతీయ రహదారి (Highway)పై రన్‌వేపై 45 నిమిషాల వ్యవధిలో రెండు రకాల యుద్ధ విమానాలతో సహా నాలుగు విమానాలు ల్యాండ్‌ అయ్యాయి. భూమికి 100 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న విమానాలు రన్‌వేను తాకి నింగిలోకి దూసుకుపోయాయి. సుఖోయ్‌ 30, రెండు తేజస్‌ ఎల్‌సీఏలు, రవాణా విమానం ఏఎన్‌32ను పరీక్షకు వినియోగించినట్లు ఓ అధికారి తెలిపారు. బాపట్ల జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహించే కసరత్తు కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ట్రయల్ రన్ కోసం ల్యాండింగ్ స్ట్రిప్ దగ్గర IAF అత్యవసర బేస్ క్యాంపులను ఏర్పాటు చేసింది. కసరత్తును విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు రాడార్ ఇతర సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల ఎయిర్ ఫోర్స్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఘటనా స్థలంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా దాదాపు 200 మంది పోలీసులను మోహరించారు, హైవేకి (Highway) ఇరువైపులా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా ట్రాఫిక్‌ను వేర్వేరు పాయింట్ల నుంచి మళ్లించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైటర్ జెట్లను సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు హైవేపై 4.1 కి.మీ పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్‌వే (ELR) నిర్మించబడింది. ప్రకాశం జిల్లాలో హైవేపై కూడా ఇదే తరహా సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యుద్ధ సమయాల్లో, ఇతర అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. రన్‌వేలా అభివృద్ధి చేసిన ఈ స్ట్రిప్‌ను అరగంటలో సిద్ధం చేయవచ్చు. రూ.86 కోట్లతో నిర్మించిన ఇది దక్షిణ భారతదేశంలోనే మొదటి ELR కాగా, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ తర్వాత భారతదేశంలో మూడవది. వివిధ రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై 19 ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేయాలని 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.