ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal ) భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా పియూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
Success Man : ఒకప్పుడు హైదరాబాద్ లో కూలీ..ఇప్పుడు ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదన..ఎలా అంటే..!!
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వాణిజ్య రంగానికి అనుకూలంగా ఉండే విధంగా కొన్ని కీలక అభ్యర్థనలు చేశారు. ముఖ్యంగా బర్లీ తుపాకి పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు మద్దతు, మ్యాంగో పల్స్‌పై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై వినతిపత్రంను కూడా మంత్రి పియూష్ గోయల్‌కు అందజేశారు.
Kohli Record Break: టీ20ల్లో విరాట్ కోహ్లీ మరో రికార్డు బ్రేక్!
రాష్ట్రంలో సాగు, పరిశ్రమ, రవాణా, మరియు ఎగుమతుల రంగాల్లో అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు, రైతులకు ఉపశమనాన్ని అందించేందుకు కేంద్రం వత్తాసు ఇవ్వాలని కోరారు. పియూష్ గోయల్ ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేంద్రం–రాష్ట్రం పరస్పర సహకారంతో అభివృద్ధికి నూతన దిశలో నడవనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
