Allu Arjun : మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు తనకి పెద్ద తలనొప్పిగా మారింది. గత పదేళ్లుగా వైసీపీ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తోడుగా.. ఈసారి ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా జనసేన వైపు నిలబడ్డారు. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్న చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్‌ని, కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ కోరుతూ డిజిటల్ ప్రచారం చేసారు. ఇక మిగిలిన కుటుంబసభ్యులు నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా జనసేనాని కోసం పిఠాపురం వచ్చారు.
కేవలం మెగా కుటుంబసభ్యులు మాత్రమే కాదు.. అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్, సినిమా పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు, చిన్నా పెద్దా ఆర్టిస్టులు తమ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరి జనసేనకి మద్దతు తెలిపారు, ప్రచారం చేసారు. కానీ మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ మాత్రం పవన్ కి ఒక చిన్న ట్వీట్ తో మద్దతు తెలిపి.. వైసీపీలో ఉన్న తన స్నేహితుడు కోసం నంద్యాల పర్యటన చేయడం అందరికి షాక్ ఇచ్చింది. మెగా అభిమానులు, జనసైనికులకు అయితే.. తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
ఇక ఇది జరిగిన తరువాత నాగబాబు తన ఎక్స్ (X) అకౌంట్‌లో.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ ట్వీట్ చేయడంతో ఈ విషయం మరింత ఆసక్తి మారింది. నాగబాబు చేసిన ఈ ట్వీట్ అల్లు అర్జున్ గురించే అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి.. పవన్ కోసం తన సీట్ ని త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో వర్మని అల్లు అర్జున్, నాగబాబు విషయం గురించి ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కలగజేసుకోకూడదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఆయన చేసిన కామెంట్స్ ఎవరు తప్పు చేసారో వారికీ గట్టిగా తగులుతాయి. కాబట్టి నిజాయితీగా పని చేసిన వారు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Ey nakkAA thappu Cheste aa nakkAA ki taguluddi @NagaBabuOffl Tweet – @SVSN_Varma 😂🔥 pic.twitter.com/J9KjK4StrU
— Raees (@RaeesHere_) May 16, 2024