Site icon HashtagU Telugu

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్

Pawan Kalyan Chandrababu Naidu

Pawan Kalyan Chandrababu Naidu

Pawan Kalyan: అమిత్ షా కోరితే లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం కాకినాడ నుండి లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్లను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కేంద్రం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని కోరితే శ్రీనివాస్ స్థానం నుంచి పోటీకి దిగుతానని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఒకవేళ పవన్ కళ్యాణ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కామెంట్స్ చేశాడు.

పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన తర్వాత ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుదారులు పిఠాపురంలో రచ్చ సృష్టించి టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్‌లను తగులబెట్టారు. ఆ తర్వాత వర్మ గత వారం చంద్రబాబు నాయుడుతో సమావేశమై, తనకు టిక్కెట్ నిరాకరించినప్పటికీ, కూటమి కోసం పనిచేస్తానని, పవన్ కళ్యాణ్‌ను గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. అయితే అంతా సెట్ అయ్యాకా పవన్ యూటర్న్ తీసుకుని ఎంపీగా పోటీ చేస్తాడా అన్న ప్రశ్న ప్రధానంగా లేవనెత్తుతుంది. నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉందని చెప్పుకునే పవన్ ఎప్పుడు, ఏ సమయాన తాను ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటిస్తాడోనని చంద్రబాబు టెన్షన్ పడుతున్నాడట. దీనికి కారణం పవన్ పక్కనున్న టీడీపీ కంటే బీజేపీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఈ నేపాధ్యంలో అమిత్ షా లోకసభ ఎన్నికల్లో పోటీకి దిగాలని కోరితే పవన్ కళ్యాణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అనే రకం. ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Also Read: BRS Party: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి సింగిరెడ్డి